కొత్త నోట్లపై దేవనాగరి లిపిని ముద్రించడాన్ని సవాలు చేస్తూ సీపీఐ నేత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
న్యూఢిల్లీ: కొత్త నోట్లపై దేవనాగరి లిపిని ముద్రించడాన్ని సవాలు చేస్తూ సీపీఐ నాయకుడు బినోయ్ విశ్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది రాజ్యాంగ నిబంధన 343(1)ను ఉల్లంఘిస్తోందని తన పిటిషన్‌లో ఆరోపించారు.
పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లతో పాటు దీన్ని కూడా నవంబర్ 25న కోర్టు విచారణకు చేపట్టే అవకాశం ఉంది. నీటిలో నానితే రంగు కోల్పోవడం, ఇతర దేశాల కరెన్సీతో పోలిఉండటం లాంటి లోటుపాట్లు కొత్త రూ.2000, 500 నోట్లలో ఉన్నాయని ఆయన ఆరోపించారు.