Binoy Viswam
-
ఢిల్లీ మద్యం కేసులో బినోయ్కి బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం విధానం కేసులో నిందితుడు హైదరాబాద్ వ్యాపారవేత్త బినోయ్‌బాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బినోయ్ బెయిల్ దరఖాస్తుపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం శుక్రవారం విచారించింది. బినోయ్బాబుపై ఎలాంటి అభియోగాలు మోపకుండా 13 నెలలపాటు జైలులో ఉంచినందుకు ఈడీపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘ఈడీ తీరు సరికాదు. వ్యక్తుల్ని ఎక్కువ కాలం ముందస్తు నిర్బంధంలో ఉంచలేరు. ఈ కేసు ఇంకా ఎంతకాలం సాగుతుంది తెలియదు. బినోయ్బాబుపై మోపిన ఆరోపణలకు సంబంధించి ఈడీ, సీబీఐ వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం బినోయ్కి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రముఖ మద్యం తయారీదారు పెర్నోడ్ రికర్డ్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న బినోయ్‌బాబు, విజయ్ నాయర్లను గత ఏడాది నవంబర్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. -
మోదీని దోషిగా నిలబెడతాం
సాక్షి, మేడ్చల్ జిల్లా: దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెడతామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ చెప్పారు. ప్రణాళికా సంఘాన్ని పాతరపెట్టి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసి అందులో కార్పొరేట్ శక్తులను సభ్యులుగా నియమించారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న శ్రామిక తిరోగమన విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక హక్కులను పరిరక్షించేందుకు చైతన్యవంతమైన పోరాటాలు సాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఆదివారం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ)జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ఆన్లైన్ బహిరంగ సభలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. జాతి వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే కార్మికవర్గం, ప్రజలు విముక్తి అవుతారని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ పాలనలో నిరుద్యోగుల శాతం 8.1కి చేరుకుందని, వివిధ ప్రభుత్వరంగ శాఖల్లో 9 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని వివరించారు. దేశంలో 40 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన జీవనం సాగిస్తున్నారని కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతా ప్రైవేట్పరమే: ఎంపీ బినోయ్ ఎయిర్ ఇస్రో, రక్షణ, బీమా, బ్యాంకులు ఇలా ప్రతి రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటం ఎంతవరకు సమంజసమని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సీపీఐ పక్ష నాయకుడు బినోయ్ విశ్వం నిలదీశారు. ఫాసిస్టు భావజాలం కలిగిన ఆర్ఎస్ఎస్ బాటలోనే బీజేపీ పయనిస్తోందని ఆరోపించారు. వచ్చే మార్చి 29, 30 తేదీల్లో జరుగుతున్న సమ్మెలో కార్మికవర్గం పాల్గొని మోదీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు. సభలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ అజీజ్ పాషా, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాల్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యం.డి.యూసుఫ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మొట్టె నర్సింహ, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి, జాతీయ నాయకులు మోహన్, ఓబులేసు, రాజేంద్రన్, విద్యాసాగర్, పీఎం మూర్తి, ప్రేంపావని పాల్గొన్నారు. -
అంబానీ, అదానీలవైపే మోదీ
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అంబానీ, అదానీలవైపే ఉన్నారని, సామాన్యుల పక్షాన నిలబడడం లేదని రాజ్యసభ లో సీపీఐ పక్షనేత బినోయ్ విశ్వం విమర్శించారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మోదీ మోకరిల్లుతున్నారని ధ్వజమెత్తారు. సబ్కా సాత్ సబ్కా వికాస్.. అంతా ఉత్తదేనని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల దేశ ప్రజలు, కార్మికవర్గం ఏమాత్రం సంతృప్తిగా లేరని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరగనున్న ఆల్ ఇండియా ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని పదే పదే డిమాండ్ చేస్తున్నా పట్టించుకో కుండా కేంద్రం రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి చట్టం తెస్తారా? అని ప్రశ్నించారు. ఏఐటీయూసీ జాతీయ ప్రధానకార్యదర్శి అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ కేంద్రం జాతిసంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. ప్రజలను కాపాడండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో మార్చిలో సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 95 శాతం మంది ప్రజలు మోదీపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. 2024లో మోదీ ప్రభు త్వాన్ని గద్దెదించే దిశగా కార్మికవర్గం పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. కాగా, తొలుత అమర్జిత్ కౌర్ ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్మారక స్తూపం వద్ద అమర్జిత్ కౌర్, బి.వి.విజయలక్ష్మి, బినయ్‌విశ్వం, ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యం.డి.యూసఫ్, అధ్య క్షుడు బాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శి వి.యస్.బోస్ తదితరులు నివాళులర్పించారు. -
ప్రభుత్వం ఎంపిక చేసిన దృశ్యాలపై ఎంపీ బినోయ్ విశ్వమ్ లేఖ
న్యూఢిల్లీ: ఆగస్టు 11న రాజస్యభలో జరిగిన రభకు సంబంధించి ప్రభుత్వం ఎంపిక చేసిన దృశ్యాలను మాత్రమే లీక్ చేసి ప్రతిపక్షాలపై తప్పుడు అభిప్రాయాలను కలిగించవద్దంటూ సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వమ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని అన్నారు. సభలోని ప్రతిపక్ష సభ్యులపై గుర్తు తెలియని సైనికులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఆగస్టు 11కు సంబంధించి పూర్తి సీసీటీవీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేకమైన జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) అమెండమెంట్ బిల్, 2021ని సెలక్ట్ కమిటీ పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయన్నారు. అయితే అప్పుడే దాదాపు 40 మంది గుర్తు తెలియని సైనికులు సభలో ప్రవేశించారన్నారు. మహిళా ఎంపీలు సహా ప్రతిపక్ష సభ్యులపై భౌతిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. అయితే బయటకు వచ్చిన వీడియోలలో మాత్రం సభ్యులు మార్షల్స్‌పై దాడి చేస్తున్నట్లు చూపించారని అన్నారు. తనపై కూడా 4–5 మంది బయటి వ్యక్తులు వచ్చి దాడిచేశారని పేర్కొన్నారు. సభలో జరిగిన అసలు విషయాన్ని దాచి ఎంపిక చేసిన వీడియోను విడుదల చేసిన కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. చదవండి : సోషల్ మీడియాకు ఊరట, చట్టంలోని కొన్ని అంశాలపై బాంబే హైకోర్టు స్టే -
మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం
సాక్షి, కేయూ క్యాంపస్: మతోన్మాద శక్తులపై, విద్యారంగ సమస్యలపై పోరాడాలని కేరళ మాజీ మంత్రి, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి భినయ్ విశ్వం పిలుపునిచ్చారు. అఖిలభారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జాతీయ సమితి సమావేశాలు కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగంలోని సెమినార్‌హాల్‌లో శనివారం ప్రారంభమయ్యా యి. ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లాఖాద్రీ అధ్యక్షత వహించిన ఈ సభలో బినయ్ విశ్వం ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీల్లో మతోన్మాద శక్తుల దాడులు పెరిగిపోయాయని తెలిపారు. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన యూ నివర్సిటీల్లో కుల,మత రాజకీయాలు తగదన్నారు. దేశంలో అక్కడక్కడ బాబాలు, దొంగస్వాములు ఆశ్రమ విద్యాలయాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నా మోదీ ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోందని విమర్శించారు. దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా ఎఫ్‌డీఐ పేరుతో విదేశీ యూనివర్సిటీలను తీసుకొచ్చే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని ఐసీహెచ్ఆర్ చైర్మన్‌గా కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన హిస్టరీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్‌రావును నియమించుకున్నారని ఆరోపించారు. 1992 డిసెంబర్ 6న హిందుత్వ మతోన్మాదులు బాబ్రీ మసీద్‌ను కూల్చివేశారన్నారు. శాస్త్రీయ విద్యావిధానం అవసరం న్యూ ఇండియా న్యూ ఎడ్యూకేషన్ తో దేశం ముందుకెళ్లాలంటే పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజా, విద్యా వ్యతిరేక విధానాలను ఏఐఎస్ఎఫ్ జాతీ య సమితి సమావేశాల్లో చర్చించి పక్కా ప్రణా ళికతో మిలిటెంట్ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఏఐ ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రీ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలనుంచి తప్పుకునేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్, ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఢిల్లీకి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రహీలపర్వీన్ మాట్లాడారు. జాతీయ సమితి సమావేశాల్లో భవిష్యత్ పోరాటాలు చేసేందుకు ఉపక్రమించేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వేణు, శివరామకృష్ణ, జాతీయ కార్యవర్గసభ్యులు స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, రంగన్న, పంజాబ్ రాష్ట్రకార్యదర్శి విక్కి మహేశ్వర్, రాజస్తాన్ రాష్ట్ర కార్యదర్శి నితిన్, రాష్ట్ర బాధ్యులు రంజిత్, అశోక్‌స్టాలిన్, రాజారాం, భానుప్రసాద్‌తో పాటు జిల్లా అధ్యక్షుడు కె నరేశ్, గడ్డం నాగార్జున తది తరులు పాల్గొన్నారు. కాగా ప్రారంభ సూచికగా శ్వేత అరుణ పతాకాన్ని ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు ఆవిష్కరించారు. ఈ నెల 7న సాయంత్రం ఈ సమావేశాలు ముగియబోతున్నాయి -
దేవనాగరి లిపిపై పిటిషన్
న్యూఢిల్లీ: కొత్త నోట్లపై దేవనాగరి లిపిని ముద్రించడాన్ని సవాలు చేస్తూ సీపీఐ నాయకుడు బినోయ్ విశ్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది రాజ్యాంగ నిబంధన 343(1)ను ఉల్లంఘిస్తోందని తన పిటిషన్లో ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లతో పాటు దీన్ని కూడా నవంబర్ 25న కోర్టు విచారణకు చేపట్టే అవకాశం ఉంది. నీటిలో నానితే రంగు కోల్పోవడం, ఇతర దేశాల కరెన్సీతో పోలిఉండటం లాంటి లోటుపాట్లు కొత్త రూ.2000, 500 నోట్లలో ఉన్నాయని ఆయన ఆరోపించారు.