సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం విధానం కేసులో నిందితుడు హైదరాబాద్ వ్యాపారవేత్త బినోయ్‌బాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బినోయ్ బెయిల్ దరఖాస్తుపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిల ధర్మాసనం శుక్రవారం విచారించింది. బినోయ్‌బాబుపై ఎలాంటి అభియోగాలు మోపకుండా 13 నెలలపాటు జైలులో ఉంచినందుకు ఈడీపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘ఈడీ తీరు సరికాదు.
వ్యక్తుల్ని ఎక్కువ కాలం ముందస్తు నిర్బంధంలో ఉంచలేరు. ఈ కేసు ఇంకా ఎంతకాలం సాగుతుంది తెలియదు. బినోయ్‌బాబుపై మోపిన ఆరోపణలకు సంబంధించి ఈడీ, సీబీఐ వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం బినోయ్‌కి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రముఖ మద్యం తయారీదారు పెర్నోడ్ రికర్డ్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న బినోయ్‌బాబు, విజయ్ నాయర్‌లను గత ఏడాది నవంబర్‌లో ఈడీ అరెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment