కేసీఆర్‌ పైకి మాత్రమే భక్తుడు: నారాయణ | CPI Narayana on CM KCR | Sakshi

కేసీఆర్‌ పైకి మాత్రమే భక్తుడు: నారాయణ

Feb 23 2017 1:16 AM | Updated on Aug 14 2018 11:02 AM

కేసీఆర్‌ పైకి మాత్రమే భక్తుడు: నారాయణ - Sakshi

కేసీఆర్‌ పైకి మాత్రమే భక్తుడు: నారాయణ

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పైకి మాత్రమే భక్తుడిలా కనిపిస్తున్నారని, లోపల నరహంతకుడిగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌ పైకి మాత్రమే భక్తుడిలా కనిపిస్తున్నారని, లోపల నరహంతకుడిగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఏపీ భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ పోలీస్‌ క్యాంపుగా మారిపోయిందనీ పాకిస్తాన్‌ సరిహద్దుగా మార్చేశారన్నారు. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వండన్న విద్యార్థుల కోరిక న్యాయబద్ధమైనందునే జేఏసీ చైర్మన్‌ కోదండరామ్, కమ్యూనిస్టులు దానికి మద్దతు పలికారని తెలిపారు. కోదండరామ్‌ను, విద్యార్థి నేతలను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారన్నారు.

ఒకవైపు తిరుపతిలో దైవపూజ చేస్తూ మరొకవైపు ఇలా అమానవీయంగా కేసీఆర్‌ ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. ఇది ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ఇలాంటి నిర్బంధం ఉంటే ఎలా ఉండేదని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ మరోవైపు కేంద్రానికి బానిసలా వ్యవహరిస్తున్నారని నారాయణ దుయ్యబట్టారు. బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగిందనీ, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత వస్తుందని సీఎం, మంత్రులు ప్రచారం చేశారనీ అలాంటిదేమీ లేదన్నారు. కేబినెట్‌ ఎజెండాలో ఆ అంశమే లేదనీ ఇలా ఎన్నిరోజులు మోసం చేస్తారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement