
'ఆ పొత్తుతో మాకేం నష్టం లేదు'
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్(పీడబ్ల్యూఎఫ్)తో సినీ నటుడు విజయకాంత్ చేతులు కలిపారు. కలిసి పోటీ చేయాలని పీడబ్ల్యూఎఫ్, డీఎండీకే నిర్ణయించాయి. దీంతో విజయకాంత్ తమతో పొత్తు పెట్టుకుంటాడని ఎదురుచూసిన డీఎంకే, బీజేపీ నిరాశపడ్డాయి.
డీఎండీకే, పీడబ్ల్యూఎఫ్ పొత్తుతో తమకు నష్టం లేదని డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. పీడబ్ల్యూఎఫ్ తో 'కెప్టెన్'తో చేతులు కలపడం తమను కలవరపరచలేదన్నారు. కెప్టెన్ విజయకాంత్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందున్న విశ్వాసాన్ని పీడబ్ల్యూఎఫ్ లోని ఎండీఎంకే నేత వైగో వ్యక్తం చేశారు. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి విజయకాంత్ అని ప్రకటించారు.