న్యూఢిల్లీ: భార్యనుంచి వేరుపడిన ఓ భర్తకు ఢిల్లీ కోర్టు దిమ్మతిరిగే షాక్ నిచ్చింది. వీరి కుమార్తె ఖర్చుల నిమిత్తం భార్యకు భరణంగా నెలకు రూ. నాలు గు లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతోపాటు ప్రతియేటా ఈ మొత్తానికి 15 శాతం పెంచుతూ భరణం చెల్లించాలని కూడా అతడిని ఆదేశించింది.
బిజినెస్ టర్నోవర్ రూ. వెయ్యికోట్లు ఉందంటూ ఓ బిజినెస్ మ్యాగజైన్‌లోని సూపర్‌రిచ్ కేటగిరీలో సదరు భర్త వార్తల్లోకి ఎక్కడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. అతని రెండేళ్ల వ్యాపారంలో గణనీయమైన వృద్ధి సాధించిన విషయాన్ని విస్మరించకూడదని అందుకే అతని మాజీ భార్య, కూతురు ఖర్చుల నిమిత్తం రూ. నాలుగు లక్షలే కాకుండా ప్రతియేటా 15శాతం పెంచుతూ ఉండాలని ప్రిన్సిపల్ జడ్జి నరోత్తమ్ కౌషల్ తీర్పునిచ్చారు.