బిన్నీ పిటిషన్‌పై వివరణ ఇవ్వండి
ఆప్‌ను ఆదేశించిన హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నేత వినోద్‌కుమార్ బిన్నీ దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు... దానిపై వివరణ ఇవ్వాలంటూ ఆ పార్టీతోపాటు నలుగురు నేతలను ఆదేశించింది. జస్టిస్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం నోటీసులు జారీచేసింది. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ లక్ష్మీనగర్ ఎంఎల్‌ఏ బిన్నీ దాఖలుచేసిన పిటిషన్‌కు సంజాయిషీ ఇవ్వాలంటూ ఆప్ నేతలు అల్కా లాంబా, మనోజ్‌కుమార్, రాజు ధింగన్, బందనా కుమారిలను ఆదేశించింది. పరువు నష్టం కలిగించినందుకు తనకు రూ. కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బిన్నీ డిమాండ్ చేశారు. కాగా కోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదావేసింది. తాను సెక్స్ రాకెట్ నడుపుతున్నానంటూ ఫేస్‌బుక్‌లో బిన్నీ.. తనపై తప్పుడు ఆరోపణలు ఉంచారంటూ లాంబా పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి విదితమే.
పోలీసులు సోదాలు జరిపారని, సెక్స్ వ్యాపారం చేస్తున్న ఇద్దరు యువతులు పట్టుబడ్డారని బిన్నీ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పేర్కొన్నారని ఆరోపిస్తూ అల్కాలాంబా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసత్యపు ఆరోపణలు చేసినందుకు ఆమె బిన్నీతో పాటు మరో 37 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫేస్‌బుక్ అకౌంట్ తనది కాదని, తన పరువు తీయడం కోసం ఎవరో తన పేరుపై నకిలీ ఖాతా తెరిచారని బిన్నీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ విషయాన్ని గతంలోనే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. తన పేరుపై ఉన్న నకిలీ ఫేస్‌బుక్ ఖాతా గురించి ఇప్పటికే పోలీసులతోపాటు న్యాయశాఖ అధికారులకు తెలియజేశానని బిన్నీ చెప్పారు. బిన్నీ ప్రతిష్టను దిగజార్చడంకోసం ఎవరో తన క్లయింట్ పేరుపై న కిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించారని, బిన్నీ ఈ విషయాన్ని రెండు నెలల కిందట పోలీసు కమిషనర్, క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులకు తెలిపారంటూ ఆయన తరపు న్యాయవాది రాహుల్‌రాజ్ మాలిక్ న్యాయమూర్తి మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకొచ్చారు.