మహిళలకు స్పెషల్‌ రివాల్వర్‌: విశేష ఆదరణ | Designed for women Nirbheek revolver has sold 2 500 pieces  | Sakshi
Sakshi News home page

మహిళలకు స్పెషల్‌ రివాల్వర్‌: విశేష ఆదరణ

Published Sat, Jul 20 2019 1:53 PM | Last Updated on Sat, Jul 20 2019 2:09 PM

Designed for women Nirbheek revolver has sold 2 500 pieces  - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో ప్రతీ క్షణమూ ఏదో ఒక మూల మహిళలు, బాలికలపై అత్యాచారాల ఆక్రందనలు వినిపిస్తూనే ఉన్నాయి. నెలల పసిపాపనుంచి పండు ముదుసలి వరకూ మృగాళ్ల అకృత్యాలకు బలవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళల కోసం పెప్పర్‌ స్ప్రేలు, పాకెట్‌ నైఫ్‌లకు తోడుగా తేలికైన రివాల్వర్‌ అందుబాటులోకి వచ్చింది. ముఖ‍్యంగా ఏడేళ్ల క్రితం దేశాన్ని కదిలించిన ఢిల్లీ నిర్భయ ఉదంతం తరువాత మళ్లీ అలాంటి దారుణాలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కాన్పూర్‌లోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ  ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్‌పోలో ‘నిర్భీక్‌’ అనే తుపాకిని ప్రదర్శించింది.

నిర్భీక్‌ రివాల్వర్‌
ప్రధానంగా మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసి చెప్పినట్టు తెలిపింది. బలమైన, ఆత్మరక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని ఫ్యాక్టరీ బోర్డు ప్రతినిధి తెలిపారు. అంతేకాదు చాలా సులువుగా దీన్ని మహిళల తమ పర్సుల్లో తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. మొదటి ఐదేళ్ళలో ఉత్తరప్రదేశ్‌, హర్యానాలలో 2,500 రివాల్వర్లను విక్రయించినట్టు వెల్లడించింది. దీని ధర కొంచెం ఖరీదైనప్పటికీ భారీ విక్రయాలను నమోదు  చేయడం విశేషం.

సాధారణ రివాల్వర్‌ ధర రూ. ఒక లక్ష రూపాయలతో పోలిస్తే నిర్భీక్‌  రూ.1.20 లక్షలకు అందుబాటులోకి తెచ్చింది. 2014లో 750 గ్రాములతో లాంచ్‌ చేసిన దీని బరువులో మరిన్ని మార్పులు చేసి ప్రస్తుతం 500 గ్రాములకు తీసుకొచ్చింది. అయితే తాజాగా జీఎస్‌టీ పెరగడంతో రూ. 1.40 లక్షల ధరతో నిర్బీక్‌ను తాజాగా విడుదల చేశారు. నిర్భీక్ 10 మీటర్ల లక్ష్యాన్ని సులభంగా ఛేదించగలదని కంపెనీ చెబుతోంది. టైటానియం అల్లాయ్ మెటల్‌తో తయారు చేసిన ఈ నిర్భీక్ తుపాకీ తుప్పు పట్టదు, మెయింటెనెన్స్‌ కూడా చాలా సులభం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement