మహారాష్ట్ర బీజేపీ నేతగా దేవేంద్ర ఫడ్నవిస్!
ముంబై: మహారాష్ట్ర బీజేపీ శాసనసభ పక్షనేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసన సభ నేత ఎంపిక కోసం ముంబైలో మంగళవారం సాయంత్రం బీజేపీ లెజిస్టేచర్ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి రాజ్ నాథ్, జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత కేంద్ర పరిశీలకుడు రాజ్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫడ్నవిస్ పేరు తప్పా ఎవరి పేరు చర్చకు రాలేదు అని అన్నారు.
నాగ్పూర్ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవిస్ విజయం సాధించారు. ఈ సాయంత్రం గవర్నర్ సి. విద్యాసాగర్ రావు ను ఎమ్మెల్యేలు కలుసుకోనున్నారు.