ప్రయాణికులకు షాకిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్
ప్రయాణికులకు షాకిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్
Published Mon, Nov 3 2014 10:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించి తన మార్కును చాటుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం భార్య, కూతురుతో కలిసి ఇతర ముఖ్యమంత్రుల్లా చార్టర్డ్ విమానంలో కాకుండా జెట్ ఎయిర్ వేస్ ఫ్లయిట్ విమానం ఎకానమీ క్లాస్ లో నాగపూర్ కు వెళ్లారు. దాంతో ఒక్కసారిగా తోటి ప్రయాణికులు, మీడియా వాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
మహారాష్ట్ర చరిత్రలో ఓ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీలా ప్రయాణించడం ఇదే మొదటిసారని, ఏ ముఖ్యమంత్రీ సాధారణ వ్యక్తిలా అందరితో కలసి ఎకానమీ క్లాస్ లో వెళ్లలేదని ఓ ప్రయాణికుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఇది ఒక శుభ పరిమాణం అన్నారు.
ఖజానాకు భారం తగ్గించడానికి అధికారులు, రాజకీయ నాయకులు ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించడం, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస లాంటివి మానుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement