
న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి విలువ పతనమవడంతో ఇంధన ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. సోమవారం సవరించిన ధరల ప్రకారం.. పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 39 పైసల ధర పెరిగింది. దీంతో ముంబైలో రికార్డు స్థాయిలో లీటరు పెట్రోల్ ధర రూ.86.56కు చేరుకుంది. డీజిల్ ధర రూ.75.54గా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.79.15, లీటరు డీజిల్ రూ.71.15గా ఉంది. ఆగస్టు 16 నుంచి ఇప్పటివరకు లీటరు పెట్రోల్‌పై రూ.2, డీజిల్‌పై రూ.2.42 ధర పెరిగింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల వల్ల సరఫరా తగ్గుతుందన్న భయంతో చమురు ధరలు 15 రోజుల్లో 7 డాలర్లు (బ్యారెల్‌కు) పెరిగాయి. రూపాయి పతనం వల్ల సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలూ పెరిగాయి. కేజీ సీఎన్‌జీ 63 పైసలు, పీఎన్‌జీ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (ఎస్‌సీఎం)కు రూ.1.11 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సీఎన్‌జీ రూ.42.60గా పీఎన్‌జీ ధర ఎస్‌సీఎంకు రూ.28.25కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment