ప్రధాని అభ్యర్థుల మధ్య చర్చ జరగాలి | Discussion to be started between Prime minster's candidates | Sakshi
Sakshi News home page

ప్రధాని అభ్యర్థుల మధ్య చర్చ జరగాలి

Published Sat, May 3 2014 4:18 AM | Last Updated on Thu, Mar 28 2019 8:40 PM

Discussion to be started between Prime minster's candidates

పితోర్‌గఢ్: అమెరికాలో ఉన్నట్లుగానే మనదేశంలోనూ ప్రధాని పదవికి పోటీ పడే కీలక అభ్యర్థుల మధ్య చర్చకు బీజేపీ అగ్రనేత అద్వానీ మద్దతు పలికారు. బీజేపీ లోక్‌సభ అభ్యర్థి అజయ్‌టామ్టాకు మద్దతుగా శుక్రవారం ఇక్కడ జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అద్వానీ మాట్లాడారు. రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించడానికి బదులు ఎన్నికల సంఘమే ప్రధాని పదవికి పోటీ పడే అభ్యర్థుల మధ్య చర్చలు నిర్వహించాలని అద్వానీ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వర్ణ చతుర్భుజి పేరుతో రహదారుల నిర్మాణం, మూడు రాష్ట్రాల ఏర్పాటు వాజ్‌పేయి సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలుగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement