ఇరు దేశాల మధ్య అన్ని కీలక అంశాలనూ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి..
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య అన్ని కీలక అంశాలనూ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి.. ఉగ్రవాద రహిత, హింసా రహిత వాతావరణం అవసరమని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌తో పేర్కొన్నారు. సోమవారం పాక్ జాతీయ దినోత్సవం సందర్భంగా నవాజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పంపిన సందేశంలో ఈ విషయాన్ని మోదీ ఉద్ఘాటించారు. జమ్మూలో గత రెండు రోజుల పాటు వరుసగా రెండు ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో మోదీ పై విధంగా స్పందించటం గమనార్హం. ఉగ్రవాదరహిత, హింసారహిత వాతావరణంలో ద్వైపాక్షిక చర్చల ద్వారానే కీలకాంశాలన్నిటినీ పరిష్కరించుకోగలమనేది తన ప్రగాఢ విశ్వాసమని మోదీ సామాజిక వెబ్‌సైట్ ట్వీటర్‌లో కూడా వ్యాఖ్యానించారు.