
మీ పాఠాలు అక్కర్లేదు: రాహుల్
రాయ్‌బరేలీ: దేశభక్తిపై ఆరెస్సెస్, బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. దేశం కోసం తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, దేశభక్తి తన రక్తంలోనే ఉందని చెప్పారు. శుక్రవారం తన నియోజకవర్గం అమేథీ పరిధిలోని సలోన్‌లో ఆయన రైతులతో మాట్లాడారు. కాగా, జేఎన్‌యూ గొడవే కాకుండా పటేల్ వర్గానికి రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న తమను కూడా ఆ పట్టించుకోవాలని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కోరింది.