
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ముప్పు నేపథ్యంలో సిబ్బంది వ్యవహరాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణులు, దివ్యాంగులైన అధికారులు, సిబ్బందికి విధులకు హాజరు కావడం నుంచి మినహాయింపు కల్పించింది. ఇతర వ్యాధులతో బాధపడే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మినహాయింపు వర్తింపచేసింది. వ్యాధులతో బాధపడేవారికి కరోనా మహమ్మారి ముప్పు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.