- మోటార్ ప్రమాదాల క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశం
- బాధిత కుటుంబానికి ఊరట
న్యూఢిల్లీ: డీటీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన 27 ఏళ్ల యువకుడి కుటుంబానికి రూ. 1.19 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని మోటార్ ప్రమాదాల క్లెయిమ్ ట్రిబ్యునల్(ఎంసీటీ) శుక్రవారం ఆదేశించింది. అతివేగంగా బస్సు ఢీకొన్న ప్రమాదంలో భగవాన్ సింగ్ మృతి చెందాడు. ఈ కేసు విచారించిన ట్రిబ్యునల్ డీటీసీ బస్సు ఇన్సూరెన్స్ చేసిన యూనెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ లిమిటెడ్ రూ. 19,13,600లను బాధితుడి భార్య, కుటుంబానికి అందజేయాలని సూచించింది. డీటీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా మోటార్‌బైక్‌పై వెళ్తున్న భగవాన్‌సింగ్ ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలై మృతి చెందినట్లు సాక్షాధారాలు, వివిధ పత్రాలను పరిశీలించిన ట్రిబ్యునల్ ఈ మేరకు నిర్దారించింది.
కేసుపూర్వాపరాలిలా..
మే 31, 2013న సుమారు 8.15 గంటలకు సిటీ ఫారెస్ట్ మీదుగా ఎంబీరోడ్డు భద్రాపూర్ మెహరులి వైపు వెళ్లే మార్గంలో సాకెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యూ టర్న్ తీసుకొనే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. డీటీసీ డ్రైవర్ రాయ్‌సింగ్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు రుజువైందని ఎంఏసీ ప్రిసైడింగ్ అధికారి కేఎస్ మోహి తెలిపారు.
ఈ క్రమంలోనే రూ. 3 కోట్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబం ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించింది. రాయ్‌సింగ్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు ఢీకొని భగవాన్ తీవ్ర గాయాలపాలైయ్యాడు. జేపీఎన్ ట్రామా సెంటర్‌కు తరలించారు. అప్పటికే మార్గమధ్యలోనే చనిపోయినట్లు ఏయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. సాకేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. బాధిత కుటుంబం హర్యానాలోని షిరిషాలో నివాసం ఉంటుంది. మృతుడు ఏడీజీ సుమావి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోడిజైనర్‌గా పనిచేస్తున్నాడు.
రూ. 1.19 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి
Published Sat, Oct 11 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
Advertisement