Affected Families
-
కట్ ఆఫ్ డేట్ మార్చండి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గడచిన పదేళ్ల కాలంలో అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి సంఖ్య వేలల్లో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తేదీని కట్ ఆఫ్ డేట్‌గా మారిస్తే వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేÔశాలకు వెళ్లారు. ఇప్పటికీ వెళుతున్నారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి మృతదేహాలు తీసుకురావడానికి కూడా వారి కుటుంబాలు అనేక కష్టాలు ఎదుర్కొన్నాయి. అప్పు చేసి గల్ఫ్ వెళ్లిన వ్యక్తి చనిపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబభారం మోయలేక కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి కట్ ఆఫ్ డేట్‌ను మార్చాలని పలువురు కోరుతున్నారు. ఎడారి దేశాల్లో తెలం‘గానం’గల్ఫ్ దేశాల్లో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమానికి జైకొట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గల్ఫ్‌లో బతుకుదెరువుకు వెళ్లి రకరకాల కారణాలతో ఇబ్బందులు పడిన వారికి ప్రభుత్వం సాయం అందించాలనే డిమాండ్ ఉంది. అందుకోసం అనేక ఉద్యమాలు కూడా జరిగాయి. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేరళ పాలసీని అమలు చేస్తామని ప్రకటించినా, ఆచరణకు నోచుకోలేదు. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందించేందుకు విధివిధానాలను ఇటీవల వెల్లడించింది. అయితే కట్ ఆఫ్ డేట్ తో చాలా కుటుంబాలకు నిరాశే ఎదురైంది. గడచిన పది నెలల కాలంలో తెలంగాణకు చెందిన వారు గల్ఫ్ దేశాల్లో దాదాపు 160 మంది చనిపోయినట్టు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.విధివిధానాలు ఇలా...ప్రభుత్వం ఈ నెల 7న జారీ చేసిన జీవో 216 ప్రకారం.. చనిపోయిన వ్యక్తి తాలూకు భార్య, పిల్ల లు లేదా తల్లిదండ్రులు మృతుడి డెత్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు క్యాన్సల్ రిపోర్టు, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలతో నేరుగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకో వాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తు, సరి్టఫికెట్లను పరిశీలించిన తర్వాత ఆర్థిక సాయం మంజూరవుతుంది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఓమన్, కత్తర్, సౌదీ అరేబీయా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు వెళ్లి చనిపోయిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 2023 డిసెంబర్ 7 తర్వాత చనిపోయిన వారు మాత్రమే అర్హులని ఆ జీఓలో స్పష్టంగా పేర్కొన్నారు. -
సర్కారు గాయం..‘సాక్షి’ సాయం
(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి): కంసాలిపేటలో నివాసముంటున్న బుజ్జి భర్త పది రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. ఆమె ఇంటిని వరద ముంచేసింది. సాయం కోసం ఆర్తనాదాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇద్దరు చిన్న పిల్లలతో మూడు రోజులుగా ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఆ వరద ముంపులోనే బతుకుతోంది. అధికారులెవరూ ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడలేదని, స్థానిక యువకులే సాయంగా నిలుస్తున్నారని చెబుతోంది. తాతల కాలం నుంచి కంసాలిపేట ఉందని, ఆ తరువాతే రాజరాజేశ్వరిపేట వచ్చిందని.. అయితే ఇప్పుడొచ్చిన అధికారులు కంసాలిపేట వాళ్లు లెక్కల్లో లేరని చెబుతున్నారని వాపోయింది.350కిపైగా కుటుంబాలు జీవిస్తున్న కంసాలిపేట ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ఆమె పాలకులను ప్రశ్నిస్తోంది. బుడమేరు వరద ధాటికి పూర్తిగా మునిగిపోయిన ప్రాంతాల్లో ఒన్ టౌన్‌లోని చిట్టినగర్ వంతెన కిందనున్న కంసాలిపేట కూడా ఒకటి. దాదాపు 1500 మంది ప్రజలు ఇక్కడ జీవిసున్నారు. మూడు రోజులుగా పాలకులుగానీ, అధికారులుగానీ ఒక్కరంటే ఒక్కరు కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పేటలో ఒక్క ఇల్లు కూడా నీట మునగకుండా లేదు. ఏ వస్తువూ మిగల్లేదు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, టిఫిన్ బళ్లు, బడ్డీ కొట్లు, సైకిళ్లు ఇలా ప్రతీదీ ఇంకా వరద ముంపులోనే ఉంది.అక్కడక్కడా ఉన్న మేడలపైనే స్థానికులు గడుపుతున్నారు. తినడానికి తిండి, తాగునీరు లేక అలమటిస్తున్నారు. చేతి పంపు నుంచి వచ్చే నీటితోనే కడుపు నింపుకుంటున్నారు. విధి నిర్వహణలో భాగంగా వారి వద్దకు వెళ్లిన ‘సాక్షి’ బృందానికి తమగోడును చెప్పుకుని భోరుమన్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ‘సాక్షి’ బృందం పలు స్వచ్ఛంద సంస్థల సాయంతో ఆహారం, తాగు నీరు సమకూర్చింది. స్థానిక యువకుల సాయంతో ఇంటింటికీ తిరిగి స్వయంగా పంచిపెట్టింది. మూడు రోజులైనా తమ వద్దకు మీడియాతో సహా ఎవరూ రాలేదని, మొదటిసారి సాక్షి బృందం మాత్రమే వచ్చి తమకు సాయం చేసిందని బాధితులంతా చెమర్చిన కళ్లతో ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.‘సాక్షి’ ప్రతినిధులే వచ్చారు మా కాలనీ నీళ్లలో ఉండిపోయింది. ఎవ్వరూ పలకరించడానికి రాలేదు. సాక్షి ప్రతినిధులు మాత్రమే వచ్చారు. ఇళ్లలోకి నీళ్లు చేరితో మిద్దెక్కి కూర్చున్నాం. వాడుకోవడానికి నీళ్లు కూడా లేవు. – వెంకటలక్ష్మి, కంసాలిపేటమాపేట ప్రభుత్వానికి తెలియదట.. మా పేట నీళ్లలో మునిగిపోతే, మాకు తెలియదు. మీకు ఏమీ రావంటున్నారు. రాజరాజేశ్వరిపేట తప్ప మీపేట లెక్కల్లో లేదంటున్నారు. ఇప్పటి వరకు మాకు అన్నం పెట్టిన నాథుడే లేడు. సాక్షి మాత్రమే మాకు అండగా నిలిచింది. మా కుర్రోళ్లు జట్టుగా ఏర్పడి ట్యూబులపై తిరుగుతూ సాయం చేస్తున్నారు. – క్రీస్తుబాబు, కంసాలిపేట -
తిథిలీ తుఫాన్ బాధిత రైతులకు సీఎం జగన్ శుభవార్త
-
వారి జీవితాల్లో వెలుగు రేఖలు.. బతుకు చూపిన ‘భారతి’
కడప సెవెన్‌రోడ్స్(వైఎస్సార్ జిల్లా:) కోవిడ్–19 ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా వీధిన పడిన పిల్లలు ఎందరో. కుటుంబ పెద్ద దిక్కయిన భర్తను కోల్పోయి ఆ భారాన్ని మోస్తున్న మహిళలు మరెందరో. ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. చీకట్లు అలుముకున్న జీవితాల్లో వెలుగు రేఖలు పూయించడం తమ సామాజిక బాధ్యతగా స్వీకరించింది భారతి సిమెంట్ యాజమాన్యం. క్షేత్ర స్థాయిలో ఈ ప్రణాళిక అమలును భుజానికెత్తుకుంది అవేర్ సంస్థ. జిల్లాలో 100 కోవిడ్ బాధిత కుటుంబాల పునరావాసానికి భారతి సిమెంట్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ (సీఎస్ఆర్) కింద నిధులు అందించింది. దీంతో కడప నగరంలోని పలువురు మహిళలకు బతుకుపై భరోసా ఏర్పడింది. చదవండి👉: మనం ప్రజా సేవకులం జీవనోపాధి ఏర్పాటు చేసుకుని స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని తమ పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించగలిగితే తాము నిశ్చింతగా ఉండగలమంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెలువరించిన వివరాల మేరకు జిల్లాలో 1,35,061 కోవిడ్ కేసులు నమోదు కాగా, 729 మంది మృతి చెందారు. జిల్లాలో 404 మంది పిల్లలు అనాథలుగా మారినట్లు ఐసీడీఎస్ సర్వే ద్వారా వెల్లడైంది. అనాథ పిల్లలను ఆదుకోవాలంటూ కలెక్టర్ విజయరామరాజు కార్పొరేట్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు భారతి సిమెంటు ముందుకొచ్చింది. సామాజిక సేవలో అపార అనుభవం ఉన్న అవేర్ స్వచ్ఛంద సంస్థను ఆహ్వానించి వారి ద్వారా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించింది. ఆర్థికాభివృద్ధి యూనిట్ల పంపిణీ నగదు పంపిణీ చేయడం వంటి చర్యలు ఫలితం ఇవ్వబోవని, ఆర్థికాభివృద్ధి యూనిట్లు పంపిణీ చేస్తే బాధిత కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని అవేర్ సంస్థ సూచించింది. ఈ కొత్త ప్రయోగానికి భారతి సిమెంటు యాజమాన్యం అంగీకరించింది. పాడి ఎనుములు, కిరాణాస్టోర్లు, చిన్నపాటి వస్త్ర దుకాణాలు, కూరగాయల దుకాణాలు, టిఫెన్ సెంటర్లు, కంప్యూటర్ సెంటర్లు, సోఫా తయారీ వంటి స్వయం ఉపాధి కల్పించారు. భారతి సిమెంట్ ప్రధాన అధికారి సాయి రమేష్, పీఆర్ఓ మేనేజర్ భార్గవరెడ్డి కలెక్టర్ విజయరామరాజు ద్వారా యూనిట్లను బాధిత కుటుంబాలకు అందించారు. ఇలా వంద కుటుంబాల్లోని 212 మంది పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించారు. తమకు ఒక దారి చూపి ఆదుకున్న భారతి సిమెంట్, అవేర్ సంస్థలకు రుణపడి ఉంటామని బాధితులు తెలిపారు. అవేర్ వ్యవస్థాపకులు మాధవన్ ఆదేశాలతో తాము జిల్లాలోని 11 మండలాలకు చెందిన వంద కుటుంబాలకు ఉపాధి యూనిట్లు అందజేశామని అవేర్ సంస్థ జిల్లా ప్రాజెక్టు అధికారి రవీంద్రారెడ్డి తెలిపారు. ఇందులో బేకరీ, జిరాక్స్, ఆటో, గొర్రెల పెంపకం తదితర యూనిట్లు ఉన్నాయని వివరించారు. యూనిట్లను బాధిత కుటుంబాలు సద్వినియోగం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. కుటుంబానికి ఆసరా దొరికింది నా భర్త అమానుల్లాబాషా, బావ అమీర్‌బాషా, అత్త షేక్ మురాద్‌బీ గత సంవత్సరం రంజాన్ నెలలో కోవిడ్‌తో మృతి చెందారు. సొంత ఇల్లు లేదు. చెర్లోపల్లెలో ప్రభుత్వం స్థలం ఇచ్చినా ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి. భారతి సిమెంట్స్, అవేర్ సంస్థ నాకు కిరాణా షాపు ఏర్పాటు చేయించడంతో కుటుంబం గడుస్తోంది. ఒక్కగానొక్క కొడుకు ప్రైవేటు స్కూలులో చదువుతున్నాడు. ఫీజులు చెల్లించలేక పోతున్నాను. దాతలు ఆదుకుని చదువుకు సాయం చేయాలి. – పర్వీన్‌బాను, రాజారెడ్డివీధి, కడప ఆపదలో ఆదుకున్నారు లాడ్జిలో గుమాస్తాగా పనిచేసే నా భర్త ఎం.చంద్రశేఖర్ గత ఏడాది జూన్ 19వ తేదీ బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. సొంత ఇల్లు తప్ప మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కోవిడ్ సోకడంతో వలంటీర్ నా భర్త వేలిముద్రను తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో వైఎస్సార్ బీమా రాలేదు. అప్పుల వారు వేధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారతి సిమెంట్, అవేర్ సంస్థలు చీరల వ్యాపారం యూనిట్ మంజూరు చేసి ఆదుకున్నాయి. దీంతో ఇల్లు గడుస్తోంది. పిల్లలకు మంచి కార్పొరేట్ విద్య అందించగలిగితే రుణపడి ఉంటాము. – ఎం.వెంకట సుజిత, పెద్దబెస్తవీధి, కడప -
గర్వపడుతున్నాం.. కానీ!
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి యువ సైనికులను అందించిన హమీర్పూర్ నుంచి కర్ణాటకలోని గుడిగెరె వరకు ఎన్నో గ్రామాల్లో శుక్రవారం విషాదం అలుముకుంది. ‘మా కొడుకు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం పట్ల గర్వంగా ఉంది. కానీ దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం ఉపేక్షించొద్దు’ అని బాధిత కుటుంబాలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. పలు గ్రామాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. పాక్‌ను విడిచిపెట్టొద్దు.. ‘మేం కొడుకును కోల్పోయాం. పాకిస్తాన్‌ను విడిచిపెట్టొద్దు. ఇలాంటి దాడులకు దిగకుండా ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలి’ అని పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా జవాలికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ తిలక్‌రాజ్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. 30 ఏళ్ల తిలక్‌రాజ్ మూడ్రోజుల క్రితమే ఇంటికి వచ్చి వెళ్లి సైన్యంలో చేరారు. ఇంతలోపే ఈ దారుణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. తిలక్‌రాజ్ కుటుంబానికి సీఎం జయరామ్ ఠాకూర్ రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు. 11నే ఇంటి నుంచి వెళ్లాడు.. ‘శ్రీనగర్ 115వ బెటాలియన్‌లో కొత్త పోస్టింగ్‌లో చేరడానికి ఈ నెల 11నే నా తమ్ముడు నాగ్‌పూర్ నుంచి వెళ్లాడు. గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో ఫోన్ చేసి మాట్లాడాను. కొత్త పోస్టింగ్‌లో చేరేందుకు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో జమ్మూ నుంచి బయల్దేరినట్లు చెప్పాడు. మధ్యాహ్నంలోపే అంతా జరిగిపోయింది’ అని అమర జవాన్ సంజయ్ రాజ్‌పుత్ సోదరుడు రాజేశ్ వాపోయారు. మహారాష్ట్ర బుల్డానా జిల్లాలోని మాల్కాపూర్కు చెందిన సంజయ్(45) నాలుగేళ్లుగా నాగ్‌పూర్‌లోని సీఆర్పీఎఫ్ 213వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. వెళ్లిన మూడ్రోజులకే నిర్జీవంగా.. పుల్వామా దాడిలో అసువులు బాసిన వారిలో ఉత్తర ప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ హర్పూర్ గ్రామానికి చెందిన పంకజ్ త్రిపాఠి ఒకరు. 2 నెలల సెలవుల్ని తమ కుటుంబంతో సరదాగా గడిపిన పంకజ్ మూడ్రోజుల క్రితమే తిరిగి విధుల్లోకి చేరేందుకు కశ్మీర్‌కు వెళ్లాడు. ఇంతలోనే ఆ కుటుంబం అతడి మరణ వార్తను వినాల్సి వచ్చింది. ‘అధికారులు మాకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. మాతృభూమి కోసం నా కొడుకు ప్రాణాలర్పించడం చాలా గర్వంగా ఉంది. అయితే ఉగ్రవాదులకు ప్రభుత్వం కచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే’నని పంకజ్ త్రిపాఠి తండ్రి ఓం ప్రకాశ్ త్రిపాఠి అన్నారు. చెట్టంత కొడుకే పోయాక ఏముంది? బిహార్‌కు చెందిన జవాన్లు సంజయ్‌కుమార్ సిన్హా, రతన్ఠాకూర్ సిన్హా ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల వేదన వర్ణనాతీతంగా ఉంది. చెట్టంత కొడుకును పోగొట్టుకున్నాక ఇక తమకు దిక్కెవరంటూ విషణ్ణ వదనుడైన సంజయ్‌కుమార్ సిన్హా తండ్రి మహేంద్ర ప్రసాద్ సిన్హా రోదిస్తున్నారు. సంజయ్‌కుమార్‌కు పెళ్లీడొచ్చిన ఇద్దరు కుమార్తెలున్నారు. బాగల్పూర్కు చెందిన రతన్ఠాకూర్కు నాలుగేళ్ల కుమారుడు ఉండగా, ప్రస్తుతం అతని భార్య గర్భిణి. దియోరాలోని 30 ఏళ్ల విజయ్ కుమార్ మౌర్య ఇంటిలో రోదనలు మిన్నంటాయి. ఏడాదిన్నర కొడుకు, భార్యతో సంతోషంగా స్వగ్రామంలో గడిపిన మౌర్య ఫిబ్రవరి 9నే జమ్మూకు తిరిగి వెళ్లారు. పశ్చిమ బెంగాల్‌లోని చక్కాసి రాజ్బంగ్షీపుర గ్రామానికి చెందిన జవాను బబ్లూ సాంత్రా కుటుంబ సభ్యుల ఆవేదన అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది. ఆధార్, పాన్ కార్డులతో మృతుల గుర్తింపు న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్ల మృతదేహాలు ముక్కలై చెల్లాచెదురుగా పడటంతో మృతులను గుర్తించడం కష్టమైంది. దీంతో సిబ్బంది బ్యాగులు, వారి దుస్తులకున్న జేబుల్లోని ఆధార్, పాన్ కార్డులు, సీఆర్పీఎఫ్ గుర్తింపు కార్డులు, సెలవు దరఖాస్తు పత్రాలతోనే గుర్తించారు. మరికొందరిని వారు ధరించిన చేతి గడియారాలు, వారి పర్సులు తదితరాల ద్వారా సహోద్యోగులు గుర్తించారు. మరికొంతమంది చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకుని ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారని ఓ అధికారి చెప్పారు. మరోవైపు ఆ సమయంలో కాన్వాయ్‌లో వెళ్తున్న జవాన్లందరి ఇళ్లకు అధికారులు ఫోన్లు చేసి.. జవాన్లలో ఎవ్వరూ గల్లంతు కాలేదనీ, చనిపోయినట్లుగా ప్రకటించిన జాబితా కచ్చితమైనదేనని చెప్పి, బతికున్న వారి కుటుంబాల్లో ధైర్యం నింపుతున్నారు. -
రూ. 1.19 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి
- మోటార్ ప్రమాదాల క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశం - బాధిత కుటుంబానికి ఊరట న్యూఢిల్లీ: డీటీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన 27 ఏళ్ల యువకుడి కుటుంబానికి రూ. 1.19 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని మోటార్ ప్రమాదాల క్లెయిమ్ ట్రిబ్యునల్(ఎంసీటీ) శుక్రవారం ఆదేశించింది. అతివేగంగా బస్సు ఢీకొన్న ప్రమాదంలో భగవాన్ సింగ్ మృతి చెందాడు. ఈ కేసు విచారించిన ట్రిబ్యునల్ డీటీసీ బస్సు ఇన్సూరెన్స్ చేసిన యూనెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ లిమిటెడ్ రూ. 19,13,600లను బాధితుడి భార్య, కుటుంబానికి అందజేయాలని సూచించింది. డీటీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా మోటార్‌బైక్‌పై వెళ్తున్న భగవాన్‌సింగ్ ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలై మృతి చెందినట్లు సాక్షాధారాలు, వివిధ పత్రాలను పరిశీలించిన ట్రిబ్యునల్ ఈ మేరకు నిర్దారించింది. కేసుపూర్వాపరాలిలా.. మే 31, 2013న సుమారు 8.15 గంటలకు సిటీ ఫారెస్ట్ మీదుగా ఎంబీరోడ్డు భద్రాపూర్ మెహరులి వైపు వెళ్లే మార్గంలో సాకెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యూ టర్న్ తీసుకొనే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. డీటీసీ డ్రైవర్ రాయ్‌సింగ్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు రుజువైందని ఎంఏసీ ప్రిసైడింగ్ అధికారి కేఎస్ మోహి తెలిపారు. ఈ క్రమంలోనే రూ. 3 కోట్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబం ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించింది. రాయ్‌సింగ్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు ఢీకొని భగవాన్ తీవ్ర గాయాలపాలైయ్యాడు. జేపీఎన్ ట్రామా సెంటర్‌కు తరలించారు. అప్పటికే మార్గమధ్యలోనే చనిపోయినట్లు ఏయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. సాకేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. బాధిత కుటుంబం హర్యానాలోని షిరిషాలో నివాసం ఉంటుంది. మృతుడు ఏడీజీ సుమావి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లోడిజైనర్గా పనిచేస్తున్నాడు. -
ఆప్తులను స్మరించుకున్న ‘ఉపహార్’ బాధితులు
న్యూఢిల్లీ: ఉపహార్ అగ్ని ప్రమాదంలో మరణించిన 59 మందిని స్మరించుకుంటూ బాధిత కుటుంబాలు శుక్రవారం ఇక్కడ ప్రార్థన సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. పదిహేడేళ్ల క్రితం ఉపహార్ సినిమా థియేటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది మరణించిన సంగతి తెల్సిందే. ఇటువంటి మానవ తప్పిదాల కారణంగా జరిగే ప్రమాదాలలో దోషులను శిక్షించేందుకు ఓ పటిష్టమైన చట్టాన్ని అమలు చేయాలని బాధిత కుటుంబాలు ఈ సందర్భంగా డిమాండ్ చేశాయి. ఉపహార్ హాలు ఎదురుగా ఉన్న గ్రీన్ పార్కులోని స్మృతి ఉపవన్‌లో బాధిత కుటుంబాలు హోమం నిర్వహించాయి. మానవ తప్పిదాల కారణంగా జరిగే విపత్తులపై విచారణ జరిపేందుకు ఓ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఉపహార్ బాధితుల అసోసియేషన్ అధ్యక్షులు నీలం కృష్ణమూర్తి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జూన్ 13, 1997లో జరిగిన ఆ అగ్నిప్రమాదంలో నీలం తన ఇద్దరు పిల్లలను కోల్పోయారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 19, 2009లో థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్, ఢిల్లీ అగ్ని మాపక శాఖ సిబ్బంది హెచ్ఎస్ పన్వర్‌లకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఆ తరువాత ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. అగ్ని ప్రమాదానికి అన్సల్ సోదరులను దోషులుగా ప్రకటించిన న్యాయస్థానం శిక్ష విధించే విషయంలో న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించారు.దోషులకు శిక్ష విధించే ముందు ధర్మాసనం నాటి విషాద దౌష్ట్యాన్ని పరిగణనలోకి తీసుకోగలదని కృష్ణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. నేరం తీవ్రతకు తగిన విధంగా శిక్ష ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. అన్సల్ విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీం వ్యాపార అవసరాల కోసం లండన్, న్యూయార్క్ నగరాలను సందర్శించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సత్వరం విచారణ జరపాలన్న గోపాల్ అన్సల్ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ అంశాన్ని వచ్చే వారం మరో ధర్మాసనానికి నివేదించాలని న్యాయమూర్తులు జేఎస్ ఖేహర్, సి.నాగప్పన్‌లు అన్సల్‌ను ఆదేశించారు. -
నిరీక్షణ
బరువెక్కిన గుండెలతో.. నీళ్లింకిన కళ్లతో ఆశలు గల్లంతు..ఎంతకీ చిక్కని ఆచూకి బాధిత కుటుంబాలు బెంబేలు బిడ్డల కోసం ఎదురుచూపులు సిటీబ్యూరో: నిరీక్షణ.. వేదన.. రోదన.. బియాస్ ఘటనలో బాధిత కుటుంబాలు తెరిపిన పడటంలేదు. గల్లంతైన బిడ్డలు క్షేమంగానే ఉన్నారా?.. ఆచూకీ చిక్కుతుందా? అనేది అంతులేని వేదనకు గురిచేస్తోంది. ప్రమాదం జరిగిన నాలుగు రోజులైనా ఇప్పటికీ తమ వారి జాడ లేకపోవడంతో నిద్రహారాలు లేకుండా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లార్జీ డ్యామ్ వద్ద విద్యార్థులు నీటి ఉధృతిలో కొట్టుకుపోతున్న దృశ్యాలను అమర్ఉజాలా.కామ్ అనే వెబ్సైట్ బుధవారం విడుదల చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్‌లు మీడియాలో ప్రసారం కావడంతో బాధిత కుటుంబాలు మరింతగా తల్లడిల్లాయి. బంధుమిత్రుల హృదయాలు కకావికలమయ్యాయి. విద్యార్థులు నీటి ఉధృతికి కొట్టుకుపోతున్న దృశ్యాలు గుండెల్ని బరువెక్కిం చాయి. ఈ వీడియోలో కొట్టుకుపోతూ కనిపించిన వారు తమ తోటి విద్యార్థులేనని ఈ దుర్ఘటన నుంచి సురక్షితంగా బయటపడిన దివ్య ‘సాక్షి’కి తెలిపింది. గట్టుపైనున్న వారు తమ వీడియో కెమెరాలో ఈ దృశ్యాలను బంధించారన్నారు. అందరూ చూస్తుండగానే నిమిషం వ్యవధిలో ఘోరం జరిగిపోయిందంటూ ఆమె విలపించారు. అప్పుడూ.. ఇప్పుడూ..అదే విషాదం గతేడాది చోటుచేసుకున్న చార్ధామ్ విషాదంలోనూ కొందరి ఆచూకీ తెలియరాలేదు. అప్పట్లో బాధిత బాధిత కుటుంబాల బాధ వర్ణనాతీతం. తాజా సంఘటన కూడా అలాంటి చేదు అనుభవాలను మిగులుస్తుందేమోనని విద్యార్థుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు కొట్టుకుపోగా ఇప్పటివరకు ఆరు మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగతా వారి ఆచూకీ లేకుండా పోయింది. వారు బతికే ఉన్నారా?, గాయపడి ఎక్కడైనా ఇరుక్కుపోయారా? అనే వివరాలు తెలియ రావడం లేదు. నదిలో బండ రాళ్లు ఉండడం, నీరు చల్లగా ఉండడంతో అసలు తమ పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియక బాధిత కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు లార్జీ, మండి డ్యామ్ పరిసరాలను జల్లెడ పడుతున్నా ఫలితం కనిపించకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ రిమోట్‌సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) సహకారంతో విద్యార్థుల ఆచూకీ కనుగొని కన్నవారి శోకాన్ని కొంతమేరైనా తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. నగర వాసులకు జూన్ నెలలో టూర్ల రూపంలో వచ్చిపడుతున్న విపత్తులు సర్వత్రా కలవర పెడుతున్నాయి. ఆశలు తలకిందులేనా..? వరద ప్రవాహంలో కొట్టుకుపోయి నాలుగు రోజులు కావడంతో విద్యార్థులు సజీవంగా ఉన్నారా..? లేదోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. సదరు విద్యార్థులు క్షతగాత్రులై కొండకోనల్లో చిక్కుకున్న పక్షంలో వారికిసరైన చికిత్స, ఆహారం, మంచినీరు అందే పరిస్థితి లేకపోవడంతో వారు బతకడం కష్టమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీని కనుగొనేందుకు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హిమాచల్ ప్రదేశ్‌లోనే మకాం వేసి గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. హోంమంత్రితోపాటు బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, దుండిగల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉన్నారు. తమ వారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ఎదురు చూపులు.... వీఎన్ఆర్-వీజేఐటీ కళాశాలకు చెందిన గల్లంతైన విద్యార్థుల్లో ఇప్పటికి ఆరుగురి మృతదేహాలు లభించిన విషయం తెలిసిందే. ఇంకా దాసరి శ్రీనిధి, రిషితారెడ్డి, పాపాని రిధిమ, ఆశిష్మంత, కిరణ్‌కుమార్, అఖిల్, తరుణ్, ఉపేందర్, శివప్రకాశ్‌వర్మ, సాయిరాజ్, బస్వరాజ్ సందీప్, రిత్విక్, జగదీష్, పరమేశ్వర్, అఖిల్ మిట్టపల్లి, విష్ణువర్ధన్‌రెడ్డి, అరవింద్‌కుమార్, కల్లూరి శ్రీహర్ష ఆచూకీ తెలియాల్సి ఉంది. కులు వెళ్తున్నానన్నాడు... మండి నుంచి కులు వెళ్తున్నట్టు చెప్పాడు.. అంతలో నీళ్లలో పడి గల్లంతైనట్టు వార్తలు.. చివరకు బుధవారం మృతదేహమై తేలినట్టు తెలిసి సాబేర్ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుల్మొహర్పార్కు కాలనీలో విషాదం అలముకుంది.