యువతను ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఈసీతో కలిసి ఫేస్‌బుక్ పనిచేయనుంది.
డెహ్రాడూన్: వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల సాధారణ ఎన్నికల్లో యువతను ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు తొలిసారి సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ ఎన్నికల సంఘం(ఈసీ)తో కలిసి పనిచేయనుంది. ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 18 ఏళ్లకు పైబడిన ఫేస్‌బుక్ వినియోగదారులందరికీ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తూ అక్టోబర్ 6 నుంచి 9 మధ్య అలర్ట్ వస్తుంది.
తరువాత ఫేస్‌బుక్ రూపొందించిన ‘రిజిస్టర్ టు వోట్’ అనే బటన్ నొక్కితే జాతీయ ఓటరు సేవల పోర్టల్‌లోకి అనుమతి లభిస్తుంది. అలా వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. భారత్‌లో సుమారు 16 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారులున్నారు.