సాక్షి, ముంబై: ఠాణేతోపాటు చుట్టుపక్కల ప్రాంతా ల్లో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేం దుకు ‘ముంబై మెట్రోపాలిటన్ రిజన్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (ఎమ్మెమ్మార్డీయే) కీలకనిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా అనేక రోజులుగా డిమాండ్ ఉన్న అనేక ప్రాజెక్టులకు అమోదం తెలిపింది. దీంతో ఠాణేతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో ఆనంద ం వ్యక్తమవుతోంది.
ఠాణే జిల్లాలో ఠాణే, నవీముంబై, కల్యాణ్-డోంబివలి, ఉల్లాస్‌నగర్, భివండీ, మీరా-బయిందర్, వసాయి-విరార్ వంటి ఏడు కార్పొరేషన్‌లతోపాటు అంబర్‌నాథ్, బద్లాపూర్ తదితర మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. జిల్లాలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని అనేక సంవత్సరాలుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో డోంబివలి-మాణ్కోలి, ఠాణే-కళ్యాణ్ రైల్వేమార్గానికి సమాంతర రోడ్డు, కాటయి-డోంబివలి-కళ్యాణ్-టీట్‌వాలా రింగురోడ్డు మొదలగు మూడు కీలక ప్రాజెక్టులకు ఎమ్మెమ్మార్డీయే ఆమోదం తెలిపింది.
శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకున్నారు. ఠాణే నుంచి డోంబివలికి వెళ్లాలంటే ప్రస్తుతం కల్యాణ్ లేదా ముంబ్రా శిల్‌ఫాటా మీదుగా తిరిగి వెళ్లాల్సివస్తోంది. డోంబివలి-మాణ్‌కోలి రోడ్డు నిర్మిస్తే కల్యాణ్, శిల్‌ఫాటాలు వెళ్లకుండా చాల తక్కువ సమయంలో డోంబివలికి చేరుకునేందుకు ఆస్కారం ఏర్పడనుంది. ఈ మార్గం కోసం అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నప్పటికీ ఎట్టకేలకు ఆమోదం లభించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
మరోవైపు ఠాణే-కల్యాణ్‌ల మధ్య రైల్వేసేవలకు అంతరాయం ఏర్పడితే కళ్యాణ్ - ఠాణేల మధ్య ప్రయాణం చాలా ఇబ్బం దికరంగా ఉంటుంది. దీంతో ఠాణే-కళ్యాణ్ రైల్వేమార్గానికి సమాంతరంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు నిర్లక్ష్యం చేశారు. అయితే శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభిం చింది. దీంతో పాటు కాటయి-డోంబివలి-కళ్యాణ్-టీట్‌వాలా రింగ్‌రూట్ ప్రాజెక్టుకు కూడా అమో దం లభించింది.
రవాణా వ్యవస్థ మెరుగుకు కృషి
Published Sat, Jun 28 2014 10:28 PM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM
Advertisement
Advertisement