బీజేపీకి వ్యతిరేకంగా పార్టీల ఏకీకరణ
లక్నో: బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీల ఏకీకరణ ప్రయత్నాలు సానుకూల దశలో సాగుతున్నాయని సమాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ తెలిపారు. శనివారమిక్కడ హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త, సామ్యవాది రామ్ మనోహర్ లోహియాకు సన్నిహితుడైన బద్రివిశాల్ పిట్టి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జనతా పరివార్ విలీనానికి అందరం ప్రయత్నిస్తున్నామని, చర్చలు విజయవంతమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. జనతా పరివార్ విలీనానికి మరెంతో సమయం పట్టదని బిహార్ సీఎం నితీశ్ కుమార్ పాట్నాలో తెలిపారు. దీనికి సంబంధించి తదుపరి సమావేశంలో స్పష్టత వస్తుందని చెప్పారు.