బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు
ములాయం కుటుంబ సమస్యలపై వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కుటుంబంలో జరుగుతున్న వివాదాలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
వారి సొంత ఇంటి సమస్యలు పరిష్కరించుకోలేక తమ పార్టీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. యూపీలో బీజేపీకి ఆదరణ పెరుగుతుండటంతో ఎస్‌పీ, బీఎస్‌పీలు బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.