పార్లమెంట్ ను కుదిపేసిన అయోధ్య యాత్ర
పార్లమెంట్ ఉభయ సభలను అయోధ్య 'చౌరాసీ కోసి పరిక్రమ యాత్ర' కుదిపేసింది. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలు పదే పదే వాగ్వాదానికి దిగడంతో సభకు పలుమార్లు అంతరాయం కలిగింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ డిమాండ్ పై సభలో గందరగోళం నెలకొంది.
రాజ్యాంగాన్ని, కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ బీజేపీ దౌర్జన్యానికి దిగి, ఢిల్లీలోని పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిందని సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని విమర్శించారు.
బీజేపీ యాత్రలకు ప్రజల, స్వాముల మద్దతు లేదని... అందుకే దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా బీజేపీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని ములాయం హితవు పలికారు. సోమవారం లంచ్ సమయానికి ముందే యాత్ర వివాదంపై ఉభయ సభలు మూడుసార్లు వాయిదా పడ్డాయి.
చౌరాసీ కోసి పరిక్రమ యాత్ర ములాయం సింగ్, పార్లమెంట్ బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ