కుప్వారాలో ఎదురుకాల్పులు.. చిక్కిన ముగ్గురు ఉగ్రవాదులు! | Encounter Is Underway Between Terrorists And Security Forces In Kupwara | Sakshi
Sakshi News home page

కుప్వారాలో ఎదురుకాల్పులు.. చిక్కిన ముగ్గురు ఉగ్రవాదులు!

Published Fri, Mar 1 2019 7:33 AM | Last Updated on Fri, Mar 1 2019 9:07 AM

Encounter Is Underway Between Terrorists And Security Forces In Kupwara - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. హంద్వారా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ముగ్గురు ఉగ్రవాదులు చిక్కినట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రవాదుల క్యాంపులపై భారత మైమానిక దళం మంగళవారం తెల్లవారుజామున మెరుపుదాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజే షోపియన్‌ జిల్లాలో జరిగిన ఎదుకాల్పులో ఇద్దరు జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement