ధరలు తగ్గాల్సిందే అరుణ్ జైట్లీ భార్య డాలీ జైట్లీ | Exclusive Jaitley's wife: 'Don't expect miracles from the Budget' | Sakshi
Sakshi News home page

ధరలు తగ్గాల్సిందే అరుణ్ జైట్లీ భార్య డాలీ జైట్లీ

Published Thu, Jul 10 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

ధరలు తగ్గాల్సిందే  అరుణ్ జైట్లీ భార్య డాలీ జైట్లీ

ధరలు తగ్గాల్సిందే అరుణ్ జైట్లీ భార్య డాలీ జైట్లీ

న్యూఢిల్లీ: ‘‘పేదవాళ్లు, గొప్పవాళ్లు ఎవరైనా కానీండి. ధరలు అందరినీ బాధిస్తున్నాయి. ఈ బడ్జెట్ ద్వారా ధరలు దిగివస్తాయన్న నమ్మకం నాకుంది. ధరల్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే నా నమ్మకం. పళ్లు, కూ రగాయల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. మార్కెట్ బాగా ఊగిసలాడుతోంది’’ ఇదీ..ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ భార్య డాలీ జైట్లీ అభిప్రాయం. గురువారం నాడు తన భర్త పార్లమెంటులో ఎన్‌డీఏ ప్రభుత్వం తరఫున బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆమె తనను కలిసిన ‘రీడిఫ్ డాట్ కామ్’ వెబ్‌సైట్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన భర్త జైట్లీ ఈ బడ్జెట్ కోసం బాగా కష్టపడుతున్నారని, సూర్యోదయం కాకముందే వెళ్లి ఎప్పుడో అర్ధరాత్రి వస్తున్నారని చెప్పారామె. తన భర్త పనితీరుపై పూర్తి నమ్మకం ఉందన్నారు.

ఒక  మహిళగా, ఆర్థిక మంత్రి భార్యగా బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తున్నారని ప్రశ్నించగా...‘మన ఆర్థిక పరిస్థితి చూసినపుడు పూర్తి సానుకూలతను ఆశించలేం. తీపి-చేదు రెండూఉంటాయనే అనుకుంటున్నా. ఏమెనా ఈ బడ్జెట్ దేశానికి మంచే చేస్తుంది.’ అన్నారామె. డాలీ తం డ్రి గిరిధారిలాల్ డోగ్రా కాంగ్రెస్ నేత. జమ్మూలో కాంగ్రెస్ తరఫున ఉప ముఖ్యమంత్రి హోదాలో... 1948 నుంచి 1975 వరకు పాతికేళ్లకుపైగా బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర ఆయనది. అందుకే తన భర్త తొ లిసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నా డాలీలో ఆందోళన కనిపిం చలేదు. ‘ఒకేబడ్జెట్‌లో అద్భుతాలను ఆశించటం సరికాదు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే రెండుమూడేళ్లు పడుతుంది. ఆ తరవాత మనమంతా సంతోషపడతాం. హాయిగా నవ్వుతాం’ అంటూ తన భర్తను రాజకీయంగానూ వెనకేసుకు వచ్చారామె.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement