సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఏది అసలైన వార్త, ఏది నకిలీ వార్త అన్న విషయం తెలియకుండా పోతోంది. సమాజంలో ఏది జరిగిన అసలైన వార్త కంటే పుకార్లే ఎక్కువగా షికార్లు చేస్తున్నాయి. వీటికి చెక్ పెట్టడానికి సోషల్ మీడియా దిగ్గజాలు ఎంతలా ప్రయత్నిస్తున్నా ఇవి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి.
(అసత్య ప్రచారంపై ప్రపంచాస్త్రం)
ప్రస్తుతం ‘అంతర్జాతీయ ఆల్ఫాబెట్ అసోసియేషన్’ తెలుగు లిపిని సెకండ్ బెస్ట్ స్క్రిప్ట్ గా ఎంపిక చేసిందనే ప్రచారం సోషల్‌మీడియాలో జోరుగా సాగుతోంది. వాట్సాప్‌లో ఈ ప్రచారం జోరందుకుంది. అయితే అది నకిలీ వార్త అని నిర్థారణ అయ్యింది. అసలు అంతర్జాతీయ ఆల్ఫాబెట్ అసోసియేషన్ అనే సంస్థే లేదు. 2012లో ఎనిమిదేళ్ల కిత్రం హాంకాంగ్‌లో ‘వరల్డ్ ఆల్ఫాబెట్ ఒలంపిక్స్’ నిర్వహించిన పోటీలో తెలుగు లిపి రెండో స్థానంలో నిలిచింది. అంతేకానీ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నట్లు అంతర్జాతీయ ఆల్ఫాబెట్ అసోసియేషన్ తెలుగు ‘లిపిని సెకండ్ బెస్ట్ స్క్రిప్ట్’ గా ఎంపిక చేయలేదు. ఇండియా టూ డే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ నిర్వహించిన ఫాక్ట్ చెక్‌లో తెలుగు లిపికి సంబంధించి వైరల్ అవుతున్న ఈ విషయం తప్పని తేలింది. (కరోనా కన్నా అవే ప్రమాదకరం)
రెండో స్థానంలో తెలుగు లిపి, ఇది ఎంత వరకు నిజం?
Published Thu, Jul 2 2020 7:28 PM | Last Updated on Thu, Jul 2 2020 8:37 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment