లోక్‌సభ టీవీ సీఈవోకు ఉద్వాసన | Farewell the Lok Sabha TV ceo | Sakshi
Sakshi News home page

లోక్‌సభ టీవీ సీఈవోకు ఉద్వాసన

Published Sun, Jun 1 2014 2:35 AM | Last Updated on Sat, Mar 9 2019 3:08 PM

Farewell the Lok Sabha TV  ceo

న్యూఢిల్లీ: త్వరలో పదవి నుంచి దిగిపోనున్న లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ లోక్‌సభ టీవీ చానల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ మిశ్రాకు ఉద్వాసన పలికారు. లోక్‌సభ సీఈవోగా రాజీవ్ మిశ్రాను తొలగిస్తూ స్పీకర్ మీరాకుమార్ ఉత్తర్వులు జారీచేశారని లోక్‌సభ సచివాలయం శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ జారీచేసింది. స్పీకర్ ఆదేశాలు శనివారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. అయితే మిశ్రా తొలగింపునకు స్పీకర్ ఎలాంటి కారణాలనూ ప్రస్తావించలేదు.

తనను సర్వీసు నుంచి తొలగించడంపై మిశ్రా స్పందిస్తూ.. నోటీసులు ఇవ్వకుండానే తొలగించడాన్ని తప్పుపట్టారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని ససారం నుంచి మీరాకుమార్ ఓడిపోయారని, ఆ వార్తను లోక్‌సభ టీవీలో ఫ్లాష్ న్యూస్‌లో ప్రసారం చేసినందుకే ఆమె తనపై వేటువేశారంటూ ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement