హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్న ఓ విమానాన్ని సోమవారం భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
భువనేశ్వర్: హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్న ఓ విమానాన్ని సోమవారం భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి ఛాతినొప్పి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని చికిత్స నిమిత్తం భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. 30 నిమిషాల అనంతరం విమానం కోల్కతాకు బయల్దేరినట్టు విమానాశ్రయ అధికారులు చెప్పారు. అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని శశి మీనన్గా గుర్తించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.