
సాక్షి, న్యూ ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తన కార్యాలయంలో వీరి చేత ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30గా ఉండగా కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం అనంతరం ఆ సంఖ్య 34కు చేరింది.