ఆ ఏడు రోజులు సెల్ఫీలు బంద్ | Freeze frame: No selfies in front of national memorials from August 12-18 | Sakshi
Sakshi News home page

ఆ ఏడు రోజులు సెల్ఫీలు బంద్

Published Wed, Aug 10 2016 4:23 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

ఆ ఏడు రోజులు సెల్ఫీలు బంద్

ఆ ఏడు రోజులు సెల్ఫీలు బంద్

న్యూఢిల్లీ: జాతీయ స్మృతి చిహ్నాల ముందు స్వీయ చిత్రాలు(సెల్ఫీలు) తీసుకోకుండా కేంద్రం పరిమితులు విధించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12 నుంచి 18 వరకు ఏ ఒక్కరూ జాతీయ స్మృతి చిహ్నాల ముందు సెల్ఫీలు తీసుకోకుండా నిబంధనలు అమలుచేయాలని కేంద్ర పర్యాటక శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది.

ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీకి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలీజెన్స్ నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఎర్రకోట చుట్టుపక్కల ఉన్న దాదాపు 3,140 చెట్ల వద్ద ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటుచేశారు. సరిహద్దులు ఏర్పాటుచేశారు. డ్రోన్ ల ద్వారా కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు రావడంతో కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement