పూర్తి ఆరోగ్యంతో ఉన్నా: కేజ్రీవాల్ | Full fit: Kejriwal | Sakshi
Sakshi News home page

పూర్తి ఆరోగ్యంతో ఉన్నా: కేజ్రీవాల్

Published Tue, Mar 17 2015 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

పూర్తి ఆరోగ్యంతో ఉన్నా: కేజ్రీవాల్

పూర్తి ఆరోగ్యంతో ఉన్నా: కేజ్రీవాల్

బెంగళూరు/సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నూతనోత్సాహంతో హస్తిన చేరుకున్నారు. అనారోగ్య సమస్యలకు ప్రకృతి చికిత్స కోసం బెంగళూరు శివార్లలోని జిందాల్ ప్రకృతి చికిత్సా సంస్థలో ఈ నెల 5న తల్లిదండ్రులతో కలసి చేరిన  చికిత్స పూర్తికావడంతో సోమవారం ఢిల్లీకి వచ్చారు.  తానిప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నానన్నారు. మరోపక్క.. కేజ్రీవాల్‌పై నిరాధార ఆరోపణలకుగాను పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజేశ్ గార్గ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సస్పెన్షన్ వేటు వేసింది. గతేడాది ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చేందుకు ప్రయత్నించారని ఆరోపించిన గార్గ్...అందుకు సంబంధించి తనతో కేజ్రీవాల్ సాగించిన ఫోన్ సంభాషణను బయటపెట్టడం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement