నెపుణ్యాల అభివృద్ధిలో జర్మనీ సహకారం | Germany to cooperate in the development of technology | Sakshi
Sakshi News home page

నెపుణ్యాల అభివృద్ధిలో జర్మనీ సహకారం

Published Tue, Sep 9 2014 1:58 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Germany to cooperate in the development of technology

మోడీతో జర్మనీ విదేశాంగమంత్రి భేటీ
 
న్యూఢిల్లీ: నైపుణ్యాల అభివృద్ధి, నదుల పరిశుభ్రత, ఘనవ్యర్థాల నిర్వహణలో పరస్పరం సహకారానికి ఓ రోడ్ మ్యాప్ రూపొందించుకోవాలని భారత్, జర్మనీ నిర్ణయించాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్యా సోమవారం అంగీకారం కుదిరింది. భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మెయిర్ సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వీరి మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. గత దశాబ్ద కాలంలో ఆర్థికంగా జర్మనీ సాధించిన ప్రగతిని మోడీ ప్రశంసించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement