సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ సభలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారింది..బీజేపీకి అనుకూలంగా టోన్‌సెట్ చేయడంతోపాటు జఠిలమైన పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీ, కృష్ణాజలాల్లో తెలంగాణ వాటా వంటి విషయంలో పరిష్కారాలు చూపినందున ధైర్యంగా ముందుకెళ్లాలని పార్టీశ్రేణులకు బీజేపీ నేతలు పిలుపునిచ్చినట్టు సమాచారం.
గురువారం పార్టీ కార్యాలయంలో రాష్ట్రపదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జ్‌ల సమావేశం జరిగింది. అసెంబీ ఎన్నికల నేప థ్యంలో పార్టీపరంగా చేపట్టాల్సిన ప్రచార కార్యక్ర మాలు, షెడ్యూల్ మొదలు ప్రచారపర్వం ముగిసే దాకా 30.40 సభల్లో ప్రధాని మోదీ, అమిత్‌షా, ఇతరనేతలు పాల్గొనడం, తదితర అంశాలపై చేపట్టాల్సిన రోడ్‌మ్యాప్‌పై ఈ సమావేశంలో చర్చించారు.
సిద్ధాంతమే ముఖ్యం ఎవరికోసమే వాటిని మార్చుకోం
‘బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అనే ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టండి. ఇది కేవలం పార్టీని బలహీనపరిచేందుకు పనిగట్టుకొని విపక్షాలు చేస్తున్న దు్రష్పచారంలో భాగమే. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ ఇటీవల మహబూబ్‌నగర్, నిజామాబాద్ సభలలో కుండబద్ధలు కొట్టినట్టు స్పష్టం చేశారు. బీజేపీకి ఎవరితోనూ పొత్తు, అవగాహన వంటివి ఉండవు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే మన ఏకైక లక్ష్యం. దీనిని సాధించేందుకు మీరంతా కృషి చేయండి. ఇక్కడ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుంది. అధికారంలోకి వస్తుంది’అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) బీఎల్.సంతోష్ పేర్కొన్నట్టు సమాచారం.
మనకు ప్రధాని మోదీ ట్రంప్ కార్డు
‘మనకు ప్రధాని మోదీ ఒక ట్రంప్ కార్డు. కేసీఆర్ సర్కార్‌పై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇది పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది. నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యసాధన మార్గంలో అందరూ కలిసికట్టుగా పనిచేయండి అని రాష్ట్రపార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాష్ జవదేకర్ పిలుపునిచ్చినట్టు తెలిసింది. ఎన్నికల సహఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ 18 పాయింట్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా చేపట్టాలని చెప్పినట్టు సమాచారం. ప్రచార కార్యక్రమాలు,బహిరంగసభలపై జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్ వివరించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment