'ఆ సెక్స్ వర్కర్లను తరలించండి' | 'Get Out, We've Had Enough,' Residents of Mumbai's Kamathipura Tell Sex Workers | Sakshi
Sakshi News home page

'ఆ సెక్స్ వర్కర్లను తరలించండి'

Published Sat, May 16 2015 11:48 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

'ఆ సెక్స్ వర్కర్లను తరలించండి' - Sakshi

'ఆ సెక్స్ వర్కర్లను తరలించండి'

ముంబై:నగరంలోని కామాథిపూరా వాసులు సెక్స్ వర్కర్లపై కొరడా ఝుళిపించేందుకు సన్నద్ధమయ్యారు. ఆసియాలోనే అతి పెద్ద రెడ్ లైట్ జిల్లాగా పిలవబడే కామాథిపూరా ప్రాంతపు సెక్స్ వర్కర్లు తమ కార్యకలాపాలను విచ్చలవిడిగా  కొనసాగించడంతో స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇకనైనా అక్కడ కొనసాగుతున్న వ్యాపార సంబంధమైన సెక్స్ కార్యక్రమాలకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకంతకూ  సెక్స్ వర్కర్లు కార్యకలాపాలు శృతిమించుతున్నాయని.. వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

 

దీనిలో భాగంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాలకు లేఖలు రాశారు. ఆ సెక్స్ వర్కర్లను వేరే చోటకు తరలించాలని రెండు వేల మందికి పైగా స్థానికులు వినతి పత్రాలు సమర్పించారు. వారి కార్యకలాపాలను 11 వ వీధిగా మాత్రమే పరిమితం చేయాలని ఆ లేఖలో కోరారు.

 

'సెక్స్ వర్కర్ల కార్యకలాపాలతో మా పిల్లలకు స్కూల్ ల్లో అడ్మిషన్లు దొరకడం లేదు. మా పిల్లలకు సంబంధాలు కూడా రావడం లేదు. బంధువులు కూడా మా ఇంటికి రావడం లేదు' అని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement