red light area
-
40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. రెడ్‌లైట్ ఏరియాలో అవాక్కైన అధికారులు
పాట్నా: నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బీహార్ వ్యాప్తంగా కుల ఆధారిత జనాభా లెక్కింపు చేపట్టింది. దీనికోసం రూ. 500 కోట్లు ఖర్చుపెడుతోంది. రెండు దశల్లో చేపట్టిన ఈ గణన జనవరి 7న ప్రారంభమైంది. మొదటి దశలో రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్యను లెక్కించగా.. రెండవ దశలో వారి కులాలు, ఉపకులాలు, మతాల వివారాలను సేకరిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరుగుతూ ప్రజల కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలను తెలుసుకుంటున్నారు. 40 మంది మహిళలు భర్త పేరు ఒక్కటే తాజాగా అర్వాల్ జిల్లాలో జనాభా లెక్కలకు వెళ్లిన అధికారులకు ఓ దిమ్మతిరిగే సంఘటన ఎదురైంది. ఈ క్రమంలో 40 మంది మహిళలు తమ భర్త పేరును రూప్‌చంద్‌గా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. మరికొంత మంది మహిళలు భర్త పేరే కాకుండా తమ పిల్లల పేర్లను రూప్‌చంద్‌గా తెలిపారు. అర్వాల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని రెడ్‌లైట్ ఏరియాలోఈ వింత ఘటన వెలుగు చూసింది. దీంతో అధికారులు అవాక్కయ్యారు. భర్తే కాదు, పిల్లల పేర్లు రూప్చందే రెడ్‌లైట్ ఏరియాలో చాలా మంది మహిళలు(సెక్స్ వర్కర్లు) డ్యాన్స్‌లు, పాటలు పాడుకుంటూ ఏళ్ల తరబడి అక్కడే నివసిస్తున్నారు. అయినా వీరికి శాశ్వత చిరునామా లేదు. వీరిలో 40 మంది మహిళలు.. తమ భర్త పేరు రూప్‌చంద్ అని చెప్పారు. చాలా మంది పిల్లలు సైతం తమ తండ్రి పేరు రూప్‌చంద్ అని తెలిపారు. రూప్‌చంద్‌ను తమ ఆత్మీయుడిగా భావించే కుటుంబాలు డజన్ల కొద్దీ ఉన్నాయి. ఇక్కడో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈరూప్చంద్ ఎవరో, అతనెక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఎవరీ రూప్‌చంద్ కుల గణన చేసేందుకు అక్కడికి వెళ్లిన రాజీవ్ రంజన్ రాకేష్ రెడ్ లైట్ ఏరియాలో నివసిస్తున్న కొంతమంది మహిళలతో మాట్లాడారు. అక్కడి మహిళల ఆధార్ కార్డులపైన కూడా భర్త పేరు రూపచంద్ అని రాసి ఉందని ఆయన పేర్కొన్నారు. రూప్‌చంద్ ఇక్కడ ఉన్న 40 మంది మహిళలకు ఆత్మీయుడని చెప్పారు. అయితే ఇంతకీ ఈ రూప్‌చంద్ ఎవరు? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు విషయం ఇదీ! రూప్‌చంద్ ఎవరనే విషయంపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అసలు రూప్‌చంద్ వ్యక్తి కాదని తేలింది. డబ్బును రూప్‌చంద్ అంటారు. ఇక్కడ నివసించే మహిళలు రూప్‌చంద్ అంటే రూపాయిని తమ సర్వస్వంగా భావిస్తారు. కాబట్టి వారందరూ తమ భర్త పేరు ముందు రూప్‌చంద్‌గా నమోదు చేసుకున్నట్లు వెల్లడైంది. దీంతో స్త్రీలు రూప్‌చంద్ పేరును భర్త లేదా తండ్రిగా చెప్పడానికి కారణం ఇదేనని తెలిసింది. -
రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లా: శ్వేతాబసు ప్రసాద్
'కొత్త బంగారు లోకం'తో టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి పెట్టినప్పటికీ తర్వాత చేసిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. అదే సమయంలో సెక్స్ రాకెట్లో ఇరుక్కోవడంతో విమర్శలపాలైంది. కానీ తర్వాతి కాలంలో ఈ కేసులో ఆమె నిర్దోషిగా తేలింది. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడినప్పటికీ, ఏడాది తిరిగేలోగా వారు విడాకులు తీసుకున్నారు. ఇలా వ్యక్తిగత జీవితంలో సమస్యలు వెంటాడటంతో ఆమె కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోయింది. తెలుగులో సరైన హిట్టు లేకపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చిన ఆమె ప్రస్తుతం "ఇండియా లాక్డౌన్" అనే సినిమా చేస్తోంది. ఇందులో ఆమె సెక్స్ వర్కర్ మెహ్రునిస్సాగా కనిపించనుంది. లాక్డౌన్లో ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులను చవిచూశారన్న అంశంతో మధుర్ బండార్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కోవిడ్ లాక్డౌన్ వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముంబైలోని రెడ్‌లైట్ ప్రాంతంలో నివసించే సెక్స్ వర్కర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో స్వయంగా తెలుసుకోవాలనుకుంది శ్వేతా. ఇందుకోసం ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా కామాటిపురను సందర్శించిందట. (చదవండి: ఏ సినిమాకు శ్వేతా జాతీయ అవార్డు అందుకున్నారు?) ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. "నేను చేసే పాత్రలు నిజమని నమ్ముతాను, అందులో లీనమైపోతాను. లేదంటే ప్రేక్షకులు ఆ పాత్రతో మమేకం కాలేరు. నా పాత్ర ఇంకా మెరుగ్గా వచ్చేందుకు మధుర్ సర్, నేను, నా టీమ్ మొత్తం రెండు వారాల క్రితం కామాటిపుర వెళ్లాం. అక్కడ వారి యాసను బట్టి నేను సినిమాలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నా. అంతే కాకుండా వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంది? వారి జీవితాలేంటో తెలుసుకున్నా. లాక్డౌన్ వాళ్ల వ్యాపారం మీదనే కాదు, వారి జీవితాల మీద కూడా గట్టి దెబ్బ కొట్టింది. కానీ అక్కడకు వెళ్లడం లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలిచింది. ముఖ్య విషయమేంటంటే నేను అక్కడ మెహ్రునిస్సాను కలిశా. అచ్చంగా నా పాత్రే కళ్లముందు కనిపించినట్లైంది. కనుక నా పాత్రను ఆమెకు అంకితం చేస్తున్నా" అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో ఇప్పటివరకు పలువురు నటీమణులు వేశ్యపాత్రలను పోషించారు. చాందినీ బార్(2001)లో టబు, చమేలీ(2003)లో కరీనా కపూర్, ట్రాఫిక్ సిగ్నల్(2007)లో కొంకొణ సెన్శర్మ, మండీ(1983)లో శబానా అజ్మీ, స్మిత పాటిల్ సెక్స్ వర్కర్లుగా కనిపించిన విషయం తెలిసిందే. (చదవండి: ఇష్టమైన ఆహారంపై స్పష్టతనిచ్చిన ప్రియాంక చోప్రా) -
నీడలకు రెక్కలు
గోడలు అడ్డు తప్పుకోవు. దూకేసి వెళ్లాలి. లేదంటే.. పడగొట్టుకుని వెళ్లాలి. రెడ్ లైట్ ఏరియాలో రెండూ కష్టమే. అక్కడ నీడలు కూడా గోడలే. తల్లులు గోడలు.. కూతుళ్లు నీడలు! ఆ నీడలకు.. రెక్కలు కడుతున్నాడు గంభీర్. చదువుల రెక్కలవి. ఎన్నికల సమయం. గౌతమ్ గంభీర్ తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. రాజకీయ అనుభవం లేదు. అనుభవం అవసరం అని కూడా అతడు అనుకోలేదు. ఏప్రిల్ నుంచి ఎన్నికలైతే, మార్చిలో రాజకీయాల్లోకి వచ్చాడు. అతడి మీద పోటీలో ఉన్నది అతిషీ సింగ్. అతడి వయసే. రాజకీయ అనుభవంలో మాత్రం సీనియర్. ‘ఆప్’ పార్టీ అభ్యర్థి. ఆ సీనియర్ని ఓడించాడు గంభీర్. 4 లక్షల 77 వేల ఓట్ల తేడాతో ఓడించాడు! రూలింగ్ పార్టీ అభ్యర్థి అనీ, మాజీ క్రికెటర్ అనీ అంత మార్జిన్ రాలేదు. అతడు ఎన్నికల్లో నిలబడక ముందు నుంచే, పద్మశ్రీ అవార్డు రాకముందే, అసలు క్రికెట్ నుంచి రిటైర్ అవడానికి నాలుగేళ్ల ముందు నుంచే గంభీర్ జనానికి తెలుసు. జనం అంటే.. నిద్రతో పస్తుల కడుపును నింపుకుంటున్నవారు. మిలటరీలో పని చేస్తున్న ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాల పిల్లలు. గూడు లేని అభాగ్యులైన ఆడపిల్లలు. వాళ్లకు అన్నం పెట్టాడు. చదువు చెప్పించాడు. వాళ్ల ఆరోగ్యం గురించి పట్టించుకున్నాడు. ఉపాధి కల్పించాడు. ఢిల్లీ నగరానికి కూడా కొంత చేశాడు. పచ్చటి మొక్కల్ని నాటించి కాలుష్యాన్ని తగ్గించే పనిని గడ్డిమోపులా తలమీదకు ఎత్తుకున్నాడు! ఇప్పుడు ఢిల్లీలోని సెక్స్ వర్కర్ల పిల్లల సంరక్షణను భుజాన వేసుకున్నాడు. ఆ బాధ్యతకు అతడు పెట్టుకున్న పేరు ‘పంఖ్’. అంటే రెక్కలు. అయిష్టమైన బతుకుల నుంచి ఆడపిల్లలకు వారు కోరుకున్న కెరీర్లో ఎదిగేలా, ఎగిరేలా రెక్కల్ని తొడగడమే ‘పంఖ్’. గంభీర్ ఎప్పుడూ మాట్లాడుతూ కనిపించడు. ఆలోచనల్లో ఉండేవాళ్లు మౌనం దాల్చడం సహజమే. క్రికెట్లోనూ అంతే, ఇప్పుడు రాజకీయాల్లోనూ అంతే. చేయడమే అతడు మాట్లాడ్డం. ‘‘ఎందుకలా ఉంటారు మీరు?’’ అని ఓ ఇంటర్వూ్యలో గంభీర్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘పనిలో ఉన్నప్పుడు మాట్లాడను’’ అన్నాడు. పదో యేట క్రికెట్లోకి వచ్చినప్పటి నుంచే గంభీర్‌కు తను చేస్తున్న పనిలోనే ఉండిపోవడం అలవాటైంది. కష్టాలు చెప్పుకోడానికి మాటలు అవసరం. కష్టాలను తీర్చడానికి మాటలు అవసరం లేదు. ఎన్నికల ప్రచారం ఉద్దృతంగా ఉన్నప్పుడు గంభీర్‌ను అతిషీ సవాల్ చేశారు. ‘‘నాతో డిబేట్‌కి వస్తావా?’’ అన్నారు. ఆమె ఛాలెంజ్‌ని గంభీర్ తిరస్కరించాడు. ‘‘ధర్నాల మీద, డిబేట్ల మీద నాకు నమ్మకం లేదు’’ అన్నాడు! అమ్మానాన్న దగ్గర పెరిగిన పిల్లల కన్నా.. వాళ్ల అమ్మానాన్నల దగ్గర పెరిగిన పిల్లలు ఎక్కువ జీవితాన్ని చూస్తారు. నెమ్మదిని అలవరచుకుంటారు. గంభీర్ అలాగే పెరిగాడు. గంభీర్ పుట్టింది, క్రికెట్లో రాణించింది, రాజకీయాల్లోకి వచ్చిందీ అంతా ఢిల్లీలోనే. ఇప్పుడు అదే ఢిల్లీలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న జీబీ రోడ్డు ఏరియా సెక్స్ వర్కర్ల పిల్లల్లోని 25 మంది విద్యార్థినులలో ఈ ఏడాది 10 మందిని, వచ్చే విద్యా సంవత్సరం 15 మందిని తన ‘పంఖ్’ సంరక్షణలోకి ‘దత్తత’ తీసుకోబోతున్నాడు. వాళ్ల ఫీజులు తనే కడతాడు. వాళ్ల ఆరోగ్య అవసరాలను తనే చూసుకుంటాడు. వాళ్ల యూనిఫామ్‌లు, వాళ్లకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు అన్నీ తనే ఏర్పాటు చేస్తాడు. అమ్మమ్మ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాడు గంభీర్. పంఖ్ కార్యక్రమాన్నీ ఆమెకే అంకితం ఇచ్చాడు. ఇప్పటికే అతడు సైన్యంలో అమరవీరులైన వారి పిల్లలు 200 మందికి చేయూతను ఇస్తున్నాడు. ఇవన్నీ చేయడం కోసమే అతడు ఆరేళ్ల క్రితం ‘గౌతమ్ గంభీర్ ఫౌండేషన్’ను నెలకొల్పాడు. ‘‘ఆడపిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలి. వారికి విస్తృతంగా చదువు, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండాలి. అందుకోసం ఏ కాస్త స్థోమత ఉన్నవారైనా ముందుకు రావాలి’’ అంటాడు గంభీర్. అమ్మమ్మ అతడిని అలా పెంచింది. -
వేశ్యావాటికలో అన్నం ముద్ద ..
ప్రభుత్వానికి తక్కువ పట్టే వాళ్లూ అసలు పట్టని వాళ్లూ ఉంటారు. అసలు పట్టని వాళ్లలో సెక్స్వర్కర్స్ ఉంటారు. దేశంలో అధికారికంగా 7 లక్షల మంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు. మెట్రో నగరాలలో రెడ్‌లైట్ ఏరియాలున్నాయి. ఈ లాక్డౌన్లో వీరికి అన్నం ఎవరు పెడుతున్నారు? రుచిరా గుప్తా ఒక జవాబు. సెక్స్ వర్కర్స్ కోసం ఈమె మొదలుపెట్టిన ‘వన్ మిలియన్ మీల్స్’ పిలుపు వీరి వాకిట కంచంలా మారింది. రుచిరా గుప్తా ఒక సీనియర్ జర్నలిస్ట్. ‘టెలిగ్రాఫ్’ (కోల్కటా)కు పని చేసేది. కాని వార్తలు రాయడం కంటే క్షేత్రంలో ఉండి పని చేయడమే ముఖ్యం అని భావించింది. తన వృత్తిలో భాగంగా ఆమె ముంబై, ఢిల్లీ, కోల్కటా వంటి మహా నగరాల్లో రెడ్‌లైట్ ఏరియాల్లో ఉన్న వేశ్యలను గమనించాక ఇంత వేదనాపూరిత జీవితాలలో ఉన్న స్త్రీల గురించి పని చేయకపోతే ఎలా అనుకుంది. ఉద్యోగం మానేసింది. ‘ఐక్యరాజ్యసమితి’లో చేరి నేపాల్, కంబోడియా, వియత్నాం వంటి దేశాలలో హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి అవసరమైన చట్టాల రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించింది. ఇండియా తిరిగి వచ్చి 2002లో ‘అప్నే ఆప్ ఉమెన్ వరల్డ్ వైడ్’ సంస్థను స్థాపించి సెక్స్వర్కర్స్ కోసం పని చేయడం మొదలుపెట్టింది. భారతదేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఆమె తీసిన డాక్యుమెంటరీ ‘సెల్లింగ్ ఇన్నోసెంట్స్’ విశేషమైన గుర్తింపును పొందింది. ఆమె అనుభవాలను హ్యూమన్ ట్రాఫికింగ్ పట్ల అవగాహన కోసం ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ పాఠాలుగా పెట్టాయి. రుచిరా చేస్తున్న కృషికి గాను ‘క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డ్’ వంటి సర్వోన్నత పురస్కారాలు దక్కాయి. ఆమె ఎడిట్ చేసిన ‘రివర్ ఆఫ్ ఫ్లెష్’ అనే సెక్స్‌వర్కర్ల కథల సంకలనం తప్పక పరిశీలించదగ్గది. ఒక్క ఫోన్ కాల్ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించాక రుచిరా గుప్తాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఢిల్లీ రెడ్‌లైట్ ఏరియాలోని ఒక పన్నెండేళ్ల అమ్మాయి. ‘అమ్మా... ఏదైనా చేయి. ఆకలితో అలమటిస్తున్నాం’ అని ఆ పాప ఏడ్చింది. ఆ పాపను రుచిరా గుప్తా సంస్థ ఢిల్లీలోని ఒక బోర్డింగ్ స్కూల్లో చేర్పించింది. లాక్డౌన్ కారణాన స్కూల్ మూసేయడంతో తిరిగి వేశ్యావాటిక చేరింది. ఆ పాప ఫోన్ ద్వారా వేశ్యావాటికలోకి ఆకలి కేకలు రుచిరాకు అర్థమయ్యాయి. కరోనా వ్యాప్తి భయంతో రెడ్‌లైట్ ఏరియాలు మూతబడ్డాయి. విటుల రాక బొత్తిగా లేదు. వీరికి మరో ఉపాధి కల్పించాలనే ఆలోచన ప్రభుత్వాలకు లేదు. అందుకని రుచిరా రంగంలోకి దిగింది. ఆ క్షణంలోనే ఐదు వందల ఆహార పొట్లాలు పురమాయించి ఢిల్లీ రెడ్‌లైట్ ఏరియాకు చేర్చింది. ఆ వార్త దావానలంలా దేశంలోని అన్ని రెడ్‌లైట్ ఏరియాలకు చేరాయి. అన్నింటి నుంచి రుచిరాకు ఫోన్లే ఫోన్లు. ‘అందరికీ అన్నం పెట్టాలని నిర్ణయించుకున్నాను. ప్రభుత్వం సాయం చేస్తోంది కాని అది సరిగ్గా అందడం లేదు’ అని అంది రుచిలా. వేశ్యలకు ఆహారం కోసం ఆమె ‘వన్ మిలియన్ మీల్స్’ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న వేశ్యావాటికల్లో రోజుకు పదిలక్షల ఆహారపొట్లాలు అందించడం లక్ష్యం. స్పందించిన గుండెలు రుచిరా గుప్తా పిలుపుకు అందరూ స్పందించారు. ఆమెకు సాయం చేసే చేతులు ముందుకు వచ్చాయి. బాస్మతి బియ్యం అమ్మకందారైన ‘ఇండియా గేట్’ సంస్థ ఒక లారీ బియ్యం పంపింది. మరెవరో డబ్బులు ఇచ్చారు. ఇంకొకరు సెక్స్ వర్కర్లకు అవసరమైన 50 వేల శానిటరీ ప్యాడ్స్‌ను పంపారు. ‘క్రమంగా మేము అన్నం పంచే బదులు డ్రై రేషన్ పంచడానికి షిఫ్ట్ అయ్యాం. ప్రతి సెక్స్ వర్కర్ కుటుంబానికి ముఖ్యమైన ఆహార వస్తువులు ఉన్న బ్యాగ్‌ను అందజేస్తున్నాం’ అంది రుచిరా. దీనమైన బతుకులు ‘లాక్డౌన్ తర్వాత దేశంలోని సెక్స్ వర్కర్లు ఎలా ఉన్నారో ఎవరికీ పట్టడం లేదు. వారు తమ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువునూ అమ్మి నాలుగు మెతుకులు తింటున్నారు. వారి ఇరుకు చిన్న గదుల్లో దాదాపు 10 మంది నివసిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో కరోనా వ్యాప్తి సులభం. వీరి పిల్లల గురించి పట్టించుకునేవారే లేరు. తల్లులు కనుక ఈ బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటే వీరు అనాథలు అవుతారు. కరోనా వల్ల దేశంలో మరో సంవత్సరం వరకూ పరిస్థితులు చక్కబడేలా లేవు. అంతవరకూ ఎలా సాయం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మా వాలెంటీర్లు యాభై కుటుంబాలకు రేషన్ తీసుకెళితే 200 మంది లైన్లలో నిలబడుతున్నారు. అయినప్పటికీ మేం చేయవలసిందంతా చేస్తున్నాం’ అంటుంది రుచిరా. ఆమె సంస్థ తాలూకు వెబ్సైట్ ‘అప్నే ఆప్ ఉమన్ వరల్డ్‌వైడ్’ (https://apneaap.org/) ని సంప్రదించి విరాళాలు ఇవ్వొచ్చు. మీరూ ఒక దీనురాలి ఆకలి తీర్చినవారవుతారు. – సాక్షి ఫ్యామిలీ -
సెక్స్‌వర్కర్ల కుమార్తెలు బురదలో పూసిన పూలు
ఇక్కడ బురద అంటున్నది వేశ్యావాటికను కాదు. వేశ్యావాటికను బురద అనే దృష్టికోణమే తప్పు అంటారు ఆ అమ్మాయిలు. సమాజమే ఒక బురద కావచ్చు...అదే ఈ బురదను తయారు చేస్తుండవచ్చు అని కూడా అంటారు. వేశ్య కూతురు వేశ్య అవుతుందని నియమం. కాదు.. సమాజ పరివర్తన కార్యకర్త అవుతుందనినిరూపిస్తున్నారు ఈ ఆశాదీపాలు. ‘స్టాప్ జడ్జింగ్.. స్టార్ట్ ఇంక్లూడింగ్’... ‘తీర్పులు ఆపండి... మమ్మల్ని తోడు తీసుకోండి’ అని సాదరంగా స్నేహహస్తాన్ని చాపుతున్నారు. ముంబైలోని కామాటిపురా నుంచి కుర్లాకు నలభై నిమిషాల ప్రయాణం. కాని ఆ ప్రయాణం కొందరికి ఒక జీవితకాలంలో సంభవించకపోవచ్చు. కామాటిపురా నుంచి బయటపడి కుర్లాలోని ‘క్రాంతి’ ఎన్.జి.ఓకు చేరిన వారికి ఒక కొత్తప్రపంచం వీలవుతుంది. ‘క్రాంతి’ సంస్థ వేశ్యలకు పుట్టిన కుమార్తెలకు కొత్త జీవితం ఇవ్వడానికి పని చేస్తోంది. వారి కలలు సాకారం కావడానికి రెక్కలు ఇస్తోంది. ఎగిరి వెళ్లదలుచుకుంటే ఎంత దూరమైనా ఎగరనిస్తుంది. అప్పడాలు.. కుట్టుమిషన్లు... ‘2009లో నేను క్రాంతి సంస్థను ప్రారంభించే వరకు ముంబైలోని కొన్ని ప్రభుత్వ సంస్థలు, ఎన్.జి.ఓలు వేశ్యల సంతానానికి కొత్త జీవితం ఇచ్చే ప్రయత్నం చేశాయి. అయితే ఆ జీవితం పరిమితమైనది. వారికి మహా అయితే అప్పడాలు తయారు చేయడం, కుట్టుపని నేర్పించడం చేసేవారు. తర్వాత వారి బతుకు ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్టుండేది. ఆ ఆడపిల్లలు ఏ కలలు కంటే ఆ కలలకు తోడు ఇవ్వాలి అని అనుకున్నాను’ అంటుంది రాబిన్చౌరాసియా. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ భారతీయురాలు అక్కడి మిలట్రీలో పని చేసి, అక్కడ లెస్బియన్ల పట్ల, గేల పట్ల ఉన్న వివక్షను వ్యతిరేకించి ఉద్యోగం మానేసింది. నేరుగా ఇండియాకు వచ్చి సెక్స్‌వర్కర్ల కుమార్తెల కోసం పని చేయడం మొదలెట్టింది. ముంబైలోని కుర్లాలో ఈమె స్థాపించిన సంస్థ తలుపులు 24 గంటలూ తెరిచి ఉంటాయి. ఏ సమయంలో అయినా ఏ వేశ్యావాటిక నుంచి అయినా ఏ అమ్మాయి అయినా ఇక్కడికి రావచ్చు. తల దాచుకోవచ్చు. కామాటిపురా సెక్స్ వర్కర్ల కుమార్తెలు ద్వేషం నుంచి ప్రేమకు ‘వేశ్యావాటికలో ఉన్నంత కాలం మా అమ్మను నేను ద్వేషించేదాన్ని. మా అమ్మ చేసే పని తప్పు అని నాకు అందరూ చెబుతుండేవారు. కాని క్రాంతి సంస్థలో చేరాక... ఆ పనిని మా అమ్మ కుటుంబం కోసం, నా కోసం చేసి ఉంటుందనే అవగాహన కలిగింది. మనల్ని మనం క్షమించుకోవడం, ఎదుటివారిని క్షమించగలగడం గొప్ప అవకాశం. అందుకే నేను మా అమ్మను ప్రేమించడం మొదలుపెట్టాను’ అంటుంది మెహక్ అనే ఒక వేశ్యకూతురు. క్రాంతికి చేరుకున్న ఇరవై ముప్పై మంది ఆడపిల్లల బాల్యం భయానకంగా ఉంది. ‘మా నాన్న ఎవరో నాకు తెలియదు. కాని వేరొకడు వచ్చి మా అమ్మను ఎప్పుడూ తంతుండేవాడు’ అని ఒకమ్మాయి చెప్తే ‘మా ఇంటికి వచ్చే ఒక మగాడు చిన్నపిల్ల అయిన నా రేటు అడుగుతుండేవాడు. మా అమ్మ వాణ్ణి బయటకు గెంటి నన్ను కాపాడుకుంటూ వచ్చింది’ అని మరో అమ్మాయి చెప్పింది. ‘నేను ఇంటి బయటివెలుతురు కూడా చూడలేదు. రోడ్డు దాటలేదు. బజారు తెలియదు. అయినా మా అమ్మ పడే హింస చూసి పదేళ్ల వయసులో పారిపోయాను. మూడేళ్లు రోడ్ల మీదే తిరిగి ఈ సంస్థకు చేరుకున్నాను’ అని ఒక అమ్మాయి చెప్పింది. సెక్స్‌వర్కర్ల జీవితాల్లో రెండో భర్తగా ప్రవేశించినవాళ్లు వారి కుమార్తెలకు నరకం చూపించడం చాలా మంది ఆడపిల్లల జీవితంలో ఉంది. కాని ఇంత బాధ అనుభవించినా సరే జీవితాన్ని కాంతివంతం చేసుకోవాలని కలలు కనడమే ఈ అమ్మాయిలు చేసిన, చేయగలుగుతున్న గొప్ప పని. సక్సెస్‌కు అర్థం ఏమిటి? ‘క్రాంతి సంస్థలో చేరిన ఆడపిల్లలకు చదువు ఉండదు. వారి ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు ఉండవు. వారు 13 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటారు. వారిని ఏ స్కూల్స్‌లోనూ చేర్పించలేము. కనుక మా దగ్గర ఒక స్కూల్ మొదలెట్టాము. ఇది అందరికీ సమానమైన స్కూలు కాదు. ఒక్కో అమ్మాయిని బట్టి ఆమెకు అవసరమయ్యే క్లాసులను డిజైన్ చేస్తాము’ అంటుంది రాబిన్ చౌరాసియా. ‘ఒక అమ్మాయిని ఏడో క్లాసు మూడుసార్లు కూచోబెట్టాము. మూడుసార్లు ఫెయిల్ అయ్యింది. నా మిత్రుడు చెప్పాడు– ఆ అమ్మాయికి రాని పని చెప్పి ఎందుకు ఫెయిల్ అయ్యాననే భావన కలిగిస్తావు. వచ్చిన పని నేర్పించి పాసయ్యానని అనుకోనివ్వొచ్చు కదా’ అని. ఈ ఫెయిల్ అయిన అమ్మాయి డ్రమ్స్ నేర్చుకుంది. ఇవాళ సంగీతం టీచరుగా చాలామంది పిల్లలకు సంతోషం పంచుతోంది. సక్సెస్‌కు నిజమైన అర్థం ఏమిటో నాకు తెలిసింది’ అంటుంది రాబిన్. క్రాంతిలో చేరిన ఆడపిల్లల్లో ఒక అమ్మాయి జుంబా డాన్సర్ అయ్యింది. ఒక అమ్మాయి యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఒక అమ్మాయి ఫ్లయిట్ అటెండెంట్ కావాలనుకుంటోంది. ఒక అమ్మాయి కామాటిపురాలో స్కూల్ తెరవాని అనుకుంటోంది. అందరు అమ్మాయిలు చక్కటి ఇంగ్లిష్‌లో మాట్లాడటం నేర్చుకున్నారు. అన్నింటికి మించి పెదాల మీద నిర్భయమైన నవ్వును నిలుపుకోవడం నేర్చుకున్నారు. రెడ్‌లైట్ ఎక్స్‌ప్రెస్ క్రాంతిలో చేరిన ఆడపిల్లలు అందరూ అంతో ఇంతో థియేటర్‌ను కూడా నేర్చుకున్నారు. వీరంతా కలిసి ‘లాల్ బత్తి ఎక్స్‌ప్రెస్’ అనే నాటకం తయారు చేశారు. లాల్ బత్తి అంటే రెడ్‌లైట్ అని అర్థం. నాటకంలో ఈ ఆడపిల్లలందరూ తలా ఒక కంపార్ట్మెంట్గా మారిపోతారు. రెడ్‌లైట్ ఎక్స్‌ప్రెస్ ఒక్కో స్టేషన్లో ఆగుతూ ఉంటుంది. ఒక్కో కంపార్ట్మెంట్ (అమ్మాయి) తన కథ చెబుతూ ఉంటుంది. ఆ కథలన్నీ వేశ్యల జీవితాలను, వారి పిల్లలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఢిల్లీ, ముంబైలలోనే కాదు న్యూయార్క్, లండన్లలో కూడా ఈ అమ్మాయిలు వెళ్లి ఆ నాటకాన్ని ప్రదర్శించారు. లండన్‌లో నాటక సందర్భంలో అక్కడి వేశ్యలను కలిసి వారి జీవితాలను పరిశీలించారు. ‘పెద్ద తేడా లేదు. అందరం ఒక్కటే’ అని ఒక అమ్మాయి చెప్పింది. ఈ నాటకం జరుగుతున్నంత సేపు వెక్కివెక్కి ఏడ్చే ప్రేక్షకులకు కొదవ ఉండదు. తీర్పులు ఎందుకు? ‘ఇండియాలో సెక్స్‌వర్క్ లీగల్. కాని సమాజపరంగా తప్పు. ఈ విభజన వారిని తమలో తాము కుంచించుకుపోయేలా చేస్తోంది. వారి చదువుకు, వైద్యానికి, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం చేస్తోంది’ అంటుంది రాబిన్ చౌరాసియా. ‘ఇది తప్పు... ఇది ఒప్పు అని తీర్పులు ఇవ్వడం చాలా సులభం. ఒకరిది తప్పు అని అనడానికి మనం ఎవరం? వారు ఆ జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నారో అందులో ఎందుకు కొనసాగుతున్నారో మనం ఊహించగలమా? కనుక తీర్పులు చెప్పడం మానండి. వారిని ఎలా కలుపుకుని పోవాలో ఆలోచించండి’ అంటుందామె.ఇది సుదీర్ఘ ప్రయాస అవసరపడే సంగతే. మనుషులు చాలా నెమ్మదిగా మారుతారు. కాని మారరేమో అనుకుని ఊరికే ఉండటం కన్నా మార్చాలని ప్రయత్నించడమే అవసరం. క్రాంతి సంస్థలోని అమ్మాయిలు చేస్తున్నది అదే.– సాక్షి ఫ్యామిలీ -
వేశ్య దగ్గరికి వెళ్లి మంచి పని చేశాడు
అక్కడికి వెళ్లాలనుకోవడం తప్పే.. కానీ వెళ్లి మంచి పని చేశాడు సుఖం కోసం వెళ్లి.. ఆమె బాధను చెరిపేశాడు మోసపోయి వ్యభిచార కూపంలో చిక్కుకున్న ఆమెకు విముక్తిని కల్పించాడు సాక్షి, న్యూఢిల్లీ : ఏ స్త్రీ వ్యభిచారం చేయాలనుకోదు. అలాగే వేశ్య వృత్తి కొనసాగించాలని కూడా ఎవరు అనుకోరు. ఇష్టపడి ఈ వృత్తిలోకి వచ్చేవాళ్లు చాలా అరుదనే చెప్పాలి. స్త్రీలను బలవంతంగా ఎత్తుకొచ్చి ఈ వృత్తిలోకి తోస్తారు లేదా ఏ తోడు లేక జీవనం కోసం ఏమి చేయాలో తెలియక ఇందులోకి వస్తారు. ప్రతి వేశ్య వెనక ఒక చీకటి బాధాకరమైన కథ తప్పక ఉంటుంది. అయితే వారి వద్దకు వెళ్లే కస్టమర్లు సుఖాన్ని కోరుకుంటారే తప్ప వారి బాధల్ని పట్టించుకోరు. కానీ ఓ వ్యక్తి ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఆ స్త్రీ వేశ్యగా మారడానికి గల కారణాలు తెలుసుకొని చలించిపోయాడు. ఎలాగైనా ఆమెను ఆ ఊబినుంచి రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆమె వద్ద నుంచి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని వారికి సమాచారం ఇచ్చారు. చివరకు ఆమెకు విముక్తి కల్పించాడు. ఇదంతా దేశ రాజధాని ఢిల్లీలోని జీపీరోడ్‌లో జరిగింది. మోసపోయి వేశ్యగా.. కోల్‌కతాకు చెందిన ఓ 27 ఏళ్ల మహిళ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదు. మరో మంచి ఉద్యోగం కోసం ఆమె వెతుకుతోంది. అంతలోనే ఆమెకు పరిచయమైన ఓ మహిళ ఢిల్లీలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మపలికింది. ఆమె మాటలు నమ్మి జూన్ 8న ఢిల్లీకి వెళ్లింది. ఉద్యోగం ఇప్పిస్తుందనే ఆశతో ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. అక్కడికి వెళ్లాక తెలిసింది సదరు మహిళ ఆమెను మోసం చేసిందని. ఓ వ్యభిచార ముఠా చేతికి చిక్కిన ఆమె.. రెండు నెలలపాటు నరకం చూసింది. ఆమె దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్ తీసుకొని బందించారు. చిత్రహింసలకు గురిచేశారు. వచ్చిన కస్టమర్లను సుఖపెట్టకుంటే హింసించేవారు. ఇక తన బతుకు ఇంతే అనుకొని అలా శవంగా జీవిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఆమె వద్దకు కోల్‌కతా కస్టమర్ వచ్చాడు. అందరిలాగే అతను ఆమె సుఖాన్ని కోరుకోకుండా బాధను పంచుకున్నాడు. ఆమె వేశ్యగా మారడానికి గల కారణాలు తెలుసుకొని చలించిపోయాడు. ఆమె సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కస్టమర్‌గా వెళ్లిన సోదరుడు అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో మహిళ సోదరుడు ఢిల్లీకి వెళ్లి అతన్ని కలిశాడు. వివరాలు తెలుసుకొని... నిర్థారించుకోవడానికి కస్టమర్‌గా వేశ్య గృహానికి వెళ్లాడు. అక్కడ తన సోదరిని చూసి చలించిపోయాడు. బయటకు వచ్చి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచారం ఇచ్చాడు. కేసు ఫిర్యాదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు పథకం ప్రకారం దాడి చేసి వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు. బందీగా ఉన్న మహిళకు విముక్తి కల్పించారు. ఉద్యోగం పేరిట మోసం చేసిన మహిళపై కేసు నమోదు చేశారు. చేసింది తప్పే అయినా ఆ కస్టమర్ ఓ మహిళను రక్షించి మంచి పని చేశాడు. -
రూము.. అమ్మాయిలంటూ ఎర..
గుంటూరుకు చెందిన రాజేష్ మంగళవారం శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చాడు. అతన్ని కొందరు మాటల్లోకి దింపారు. అందమైన అమ్మాయి ఉంది.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. తక్కువ రేటుకు మంచి రూము ఇప్పిస్తాను అని చెప్పి నమ్మించారు. ఆకర్షితుడైన రాజేష్ వారివెంట వెళ్లాడు. బస్టాండు సమీపంలోని ఓ హోటల్ రూములోకి తీసుకెళ్లాడు. అప్పటికే గదిలో అమ్మాయి ఉంది. ఆమె రాజేష్‌ను లోనికి తీసుకెళ్లి కూల్ డ్రింక్ ఇచ్చింది. అది తాగిన కొద్ది సేపటికే అతను నిద్రలోకి జారుకున్నాడు. గంట తరువాత మెళకువ వచ్చి చూడగా అక్కడ ఎవరూ లేరు. తన జేబులో ఉన్న రూ.14 వేలు, బంగారు ఉంగరం కనిపించలేదు. హోటల్ వారిని అడిగినా సమాధానం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందనుకున్నాడు. జేబులో ఉన్న రూ.5లతో కాయిన్ బాక్స్ నుంచి తన స్నేహితుడి ఫోన్‌చేసి జరిగిన మోసాన్ని వివరించాడు. అతని ద్వారా రేణిగుంట సమీపంలోని గాజులమండ్యం పారిశ్రామికవాడలో పనిచేస్తున్న స్నేహితుని వద్ద రూ.వెయ్యి తీసుకుని తిరిగి గుంటూరు బస్సు ఎక్కాడు. లీలామహల్ సమీపంలోని సత్యనారాయణపురం వద్ద మంగళవారం రాత్రి ఓ పది మంది మద్యం సేవించి మహిళలను తీసుకుని కేకలు వేస్తూ చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడ వారి కేకలు విన్న స్థానికులు షీటీంకు సమాచారం ఇచ్చారు. స్పందించిన షీ టీం సత్యనారాయణపురంలో రాత్రంతా గాలించారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న పోకిరీ బ్యాచ్ గుట్టుచప్పుడు కాకుండా తప్పించుకున్నారు. ఈ రెండు సంఘటనలే కాదు. తిరుపతి నగరం ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. సాక్షి, తిరుపతి: ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన తిరుపతికి నిత్యం వేలాది మంది దేశ విదేశాల నుంచి భక్తులు చేరుకుంటుంటారు. యాత్రికుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు కొందరు పురుషులు, మహిళలు ముఠాగా ఏర్పడి తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, గ్రూపు థియేటర్ పరిసరాలను అడ్డాగా చేసుకున్నారు. యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రెట్‌లైట్ ఏరియాను తలపిస్తున్న తిరునగరి తిరుపతిలో పెచ్చుమీరిన వ్యభిచారాన్ని నియంత్రించేందుకు పోలీసులు తరచూ దాడులు చేస్తున్నారు. వ్యభిచార ముఠాలను కటకటాలకు పంపిస్తున్నారు. వారికి సహకరిస్తున్న లాడ్జీల యజమానులను సైతం అరెస్టు చేస్తున్నారు. ఈ ముఠా సభ్యులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటూ ముందుకు సాగిస్తున్నారు. తరచూ ఆర్టీసీ బస్టాండు ఏరియాలో మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని యాత్రికులను ఆకర్షించి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. మరికొంత మంది నివాసాల్లోనే యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలకు తెరతీస్తున్నారు. తమిళనాడు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా రెగ్యులర్ కస్టమర్లకు వారి ఫొటోలను వాట్సప్‌ల ద్వారా పంపుతూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం దాడులు చేస్తున్నా ఈ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అత్యంత వేగంగా ఎయిడ్స్ వ్యాప్తి జిల్లాలో ఎయిడ్స్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని అధికారిక గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అధికారిక సమాచారం మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 23,343 మంది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. ఈ ఏడాదిలోనే 3,200 మంది ఎయిడ్స్ వ్యాధిన పడినట్లు తేలింది. తిరుపతితో పాటు రేణిగుంట, సత్యవేడు, మదనపల్లి, కుప్పం తదితర ప్రాంతాల్లో ఎయిడ్స్ రోగుల సంఖ్య అధికంగా ఉన్నట్లు హెచ్చరించారు. జిల్లాలో ఎయిడ్స్ వేగంగా వ్యాప్తి చెందడానికి పైన ప్రస్తావించిన సంఘటనలే నిదర్శనం. సంబంధిత అధికారులు స్పందించి వ్యభిచార ముఠాకు అడ్డుకట్ట వేయకపోతే మరింత మంది ఎయిడ్స్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
రెడ్‌లైట్ ఏరియాపై రైడ్.. విషాదం!
రెడ్‌లైట్ ఏరియాలోని వేశ్యగృహాలపై పోలీసులు జరిపిన దాడులు.. విషాదానికి కారణమయ్యాయి. పోలీసుల నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న ఇద్దరు మైనర్ బాలికలు సమీపంలో ఉన్న చెరువులోకి దూకారు. దీంతో ఆ ఇద్దరు నీళ్లలోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో మంగళవారం జరిగింది. భరత్‌పూర్‌లో వేశ్యగృహాలపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో వారి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు మైనర్ అమ్మాయిలు ప్రయత్నించారు. ఈక్రమంలో వారు చెరువులోకి దూకడంతో ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను పోలీసులు వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
'ఆ సెక్స్ వర్కర్లను తరలించండి'
ముంబై:నగరంలోని కామాథిపూరా వాసులు సెక్స్ వర్కర్లపై కొరడా ఝుళిపించేందుకు సన్నద్ధమయ్యారు. ఆసియాలోనే అతి పెద్ద రెడ్ లైట్ జిల్లాగా పిలవబడే కామాథిపూరా ప్రాంతపు సెక్స్ వర్కర్లు తమ కార్యకలాపాలను విచ్చలవిడిగా కొనసాగించడంతో స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇకనైనా అక్కడ కొనసాగుతున్న వ్యాపార సంబంధమైన సెక్స్ కార్యక్రమాలకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకంతకూ సెక్స్ వర్కర్లు కార్యకలాపాలు శృతిమించుతున్నాయని.. వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. దీనిలో భాగంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాలకు లేఖలు రాశారు. ఆ సెక్స్ వర్కర్లను వేరే చోటకు తరలించాలని రెండు వేల మందికి పైగా స్థానికులు వినతి పత్రాలు సమర్పించారు. వారి కార్యకలాపాలను 11 వ వీధిగా మాత్రమే పరిమితం చేయాలని ఆ లేఖలో కోరారు. 'సెక్స్ వర్కర్ల కార్యకలాపాలతో మా పిల్లలకు స్కూల్ ల్లో అడ్మిషన్లు దొరకడం లేదు. మా పిల్లలకు సంబంధాలు కూడా రావడం లేదు. బంధువులు కూడా మా ఇంటికి రావడం లేదు' అని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
అంగడి బొమ్మల అక్షరప్రేమ
వారు సమాజం చేతుల్లో శాపగ్రస్థులైన పడతులు...పొట్టకూటి కోసం శరీరాన్ని తాకట్టు పెడుతున్న దయనీయ మూర్తులు... ఇతరుల దేహకాంక్షలో దహించుకుపోతున్న ఈ అంగడి బొమ్మలు ఇప్పుడు తమ బతుకులు తామే బాగు చేసుకొనేందుకు సిద్ధమయ్యారు. నాలుగక్షరాలు నేర్చుకొనేందుకు స్వయంగా ఓ స్కూలు పెట్టుకున్నారు. దేశంలోనే వినూత్నమైన ఈ విద్యాలయం ఇలాంటి బాధాసర్పదష్టుల పట్లనిర్లిప్తంగా ఉన్న సర్కారుకు చెంపపెట్టు. సంగ్లి... పసుపు, చెరుకులకు ఆసియా ఖండంలోనే అతి పెద్ద మార్కెట్ ప్లేస్. మహారాష్ట్రలోని ఈ నగరం ఎప్పుడూ అమ్మకాలు, కొనుగోళ్లు గోలలోనే పగలు-రేయి గడుపుతుంది. అలాంటి రణగొణ ధ్వనుల మధ్య ఒక ఉదయం గణగణ మంటూ గంట కొట్టింది. బిలబిల మంటూ 30-40 మంది యువతులు వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చున్నారు. కర్కశకాలపు వికృత చేష్టల తాలూకు అచ్చులు వారి ముఖం మీద ముద్రితమై ఉన్నాయి. ఇంతలో ఒక నడివయస్కురాలు వచ్చి అక్కడ నిలబడగానే అందరూ లేచి నిలబడ్డారు. ‘‘భగవంతుడా! శక్తినివ్వు...’’ అంటూ అందరూ సామూహికంగా ప్రార్థనా గీతం ఆలపించి కూర్చున్నారు. వారి మధ్య నుండి ఒక యువతి వచ్చి. బ్లాక్ బోర్డ్ మీద ఎబిసిడి అని రాస్తుండగా, అక్కడున్న కూర్చున్న వారందరూ ఆ అక్షరాలను దిద్దుతున్నారు. ఆ రోజు నేర్చుకోవాల్సిన అక్షరాల కోటా పూర్తవగానే అందరూ లేచి ఎవరి పనులకు వారు తిరిగి వెళ్లిపోయారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆ స్కూల్ ఉన్నది ఒక రెడ్ లైట్ ఏరియాలో. అక్కడ పాఠం నేర్చుకొనే యువతులే కాదు, నేర్పించే యువతులూ వేశ్యలే! ‘మేడమ్స్ స్కూల్ ఫర్ సెక్స్ వర్కర్స్’! మన దేశంలో వేశ్యల కోసం ఏర్పడ్డ ఏకైక విద్యాలయం ఇది. ఇక్కడ ఉన్నవారు వారి ఫ్యామిలీని పోషించుకునే మార్గం లేక ఈ వృత్తిని చేపట్టిన పెళ్లికాని అమ్మాయిలతో పాటు పిల్లల తల్లులు కూడా ఎంతోమంది ఉన్నారు. వారి పరిస్థితి మార్చేందుకు గాను ఒక అడుగు ముందుకు వేశారు - మేడమ్ బందావల్. వారి కోసం ఈ స్కూల్ ప్రారంభించారు. ఈ స్కూలులో ఇప్పుడు అక్షరాలు దిద్దుతున్న మందార వయసు 22 ఏళ్ళు. పదేళ్ళ వయసులో ఉండగా ఆమెను ఎవరో పట్నంలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఇక్కడ అమ్మేశారు. పొట్ట నింపుకోవడం కోసం ఈ వృత్తిలో కొనసాగుతున్న ఆమెను ‘నీకు ఏం కావాలి’ అని అడిగితే, ‘నాకు చదువుకోవాలని ఉంది’ అని సమాధానమిస్తుంది. పూజది మరో కథ. దారిద్య్ర రేఖ దిగువన బతుకుతున్న పూజ వద్ద అవిటి కొడుకుకు వైద్యం చేయించడానికి డబ్బులు లేవు. చేయడానికి పని లేదు. ఇలాంటి పరిస్థితుల నడుమ పూజ ఇక్కడికి చేరుకోక తప్పలేదు. ఇలాంటి మందారలు, పూజలు అక్కడ ఎందరో! ఈ సమాజం నుండి వారికి జరిగే మేలు శూన్యమే. ఈ పరిస్థితుల్లో ఎవరి కోసమో ఎదురు చూసే కన్నా తమని తాము ఉద్ధరించుకోవడం మంచిదని భావించి ఇలా ఒక పాఠశాలను ఏర్పరచుకున్నారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితం ఈ పాఠశాలను ప్రారంభించాను. ఈ సమాజం మమ్మల్ని పగటిపూట అంటరానివారిగా, రాత్రి మాత్రమే మనుషుల్లా చూస్తుంది. మాలో చాలా మందికి చదువంటే తెలీదు. కొంతమందికి చదువు అంటే ఇష్టం ఉన్నా కూడా చదివే స్థోమత లేదు. అందుకే కనీసం ప్రాథమిక విద్య అయినా అందించాలని ఈ స్కూల్ ప్రారంభించా. బతకడానికి కావాల్సినట్టు... అంటే... బస్సు, రైళ్ల పేర్లు చదవడం, బ్యాంక్‌లో డబ్బులు ఎలా వేసుకోవాలో, తీసుకోవాలో తెలిసేలా చదివిస్తాం’’ అని చెప్పారు మేడమ్ బందావల్. ‘‘ఈ స్కూల్‌ను ప్రారంభించినప్పుడు మమ్మల్ని చూసి ఎంతోమంది నవ్వారు. ఎద్దేవా చేశారు. 50-55 ఏళ్లు ఉన్నవారికి చదువు నేర్పించి ఏం చేస్తారు? అంతేకాదు మా వాళ్లు ఎవరైనా చుట్టుపక్కల వేరే ప్రాంతాలకు వెళ్తే.. ‘ఏయ్... ఇది స్వరూప్ థియేటర్ (రెడ్ లైట్ ఏరియాలోని చోటు)లో ఉండేది. ఇక్కడికెందుకు వచ్చింది?’ అని తిట్టి పంపించేస్తారు. ఇలా వేరే బతుకు బతుకుదాం అనుకున్నా సమాజం ఒప్పుకోవడం లేదు’’ అంటూ ఆవేదన చెందారు మేడమ్ బందావల్. అందుకేనేమో వారిలో ఈ తెగింపు. ఐఏఎస్సో, ఐపీఎస్సో అవుదామని కాక, స్వీయ అభివృద్ధి కోసం విద్యాభ్యాసం చేస్తున్నారు. కానీ, విచారకరం ఏమిటంటే, తమ బాగు కోసం వేశ్యలు తమకు తాము చేపట్టిన ఈ పనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేకపోవడం. గత ఎనిమిదేళ్లలో ఎన్ని దరఖాస్తులు పెట్టినా, కనీసం ఒక టీచర్‌ను కూడా వారికి ఇవ్వలేకపోయింది అక్కడి ప్రభుత్వం. స్వచ్ఛంద సంస్థల ఆదరణకు కూడా దూరమైన ఈ పాఠశాలకు కనీసం ఈ ఏడాదైనా పురోగతి దక్కుతుందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. - జాయ్ -
గర్వంగా ఉంది..!
ఓటు హక్కు వినియోగించుకోవడంపై సెక్స్‌వర్కర్లు న్యూఢిల్లీ: ఏ పండగొచ్చినా, ఏ వేడుక జరుపుకున్నా అవన్నీ నాలుగు గోడల మధ్యే. ఎందుకంటే వారు బయట ప్రపంచాన్ని చూసేది చాలా తక్కువ. కానీ గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కారణంగా వారు బయటకు వచ్చారు. అందరితో సమానంగా క్యూలైన్లలో నిలబడి తమకు నచ్చిన నేతకు ఓటు వేశారు. ఇలా సాధారణ జనంతో సమానంగా బారులు తీరడం, ఓటుహక్కు వినియోగించుకోవడం గురించి వారు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే బయటి ప్రపంచాన్ని చాలా తక్కువగా చూసేదే తక్కువ. ఒకవేళ బయటకు వచ్చినా మిగతా జనాలతో కలిసిపోయే అవకాశమే రాదు. ఒకవేళ వచ్చినా చుట్టూ ఉన్న జనం వారి గురించి వింతగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే వారంతా సెక్స్‌వర్కర్లు. కానీ గురువారం మాత్రం ఓటు వేసేందుకు వచ్చి క్యూలైన్లలో నిలబడినా వారి గురించి ఎవరూ వింతగా మాట్లాడుకోలేదు. జీబీ రోడ్డులోని రెడ్‌లైట్ ఏరియాలో ఉంటున్న సెక్స్‌వర్కర్లు తమ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్‌కు కుటుంబ సభ్యులతో కలిసి ఓటువేసేందుకు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో మేమూ భాగస్వాములమవుతున్నందుకు గర్వంగా కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో చాందినీచౌక్ నియోజకవర్గం గురించి ఈసారి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. అందుకు కారణం ఇక్కడి నుంచి మహామహులు బరిలోకి దిగుతుండడమే. కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రి కపిల్ సిబల్, బీజేపీ నుంచి హర్షవర్ధన్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అశుతోష్ బరిలోకి దిగారు. ఇలాంటివారిలో ఒకరిని ఎంచుకొని ఓటువేసే హక్కు మాకు లభించింది. ఓటు వేసి బయటకు వచ్చాక గొప్పగా అనిపించింది. నేనూ భారతీయ పౌరురాలినేననే భావన కలిగింద’ణి పూర్ణిమా(పేరు మార్చాం) అనే సెక్స్‌వర్కర్ తెలిపింది. ‘ప్రజలు మా గురించి చులకనగా మాట్లాడుకోని రోజు ఏదైనా ఉందంటే అది బహుశా ఇదేనేమో. అందరితో సమానంగా మేం కూడా క్యూలైన్లలో నిలబడ్డాం. మాకు నచ్చిన వ్యక్తికి ఓటు వేశాం. ఇదేవిధంగా మరోచోట ఎక్కడైనా క్యూలైన్లలో నిలబడితే అనేక అవమానాలను ఎదుర్కొనాల్సి వచ్చేది. మాటలతో, చేష్టలతో, అవమానకరమైన చూపులతో నీచంగా చూసేవారు కూడా గురువారం సాధారణ పౌరుల్లాగే చూశార’ని ఆరణి అనే మరో సెక్స్‌వర్కర్ తన మనసులోని అభిప్రాయాలను మీడియాతో పంచుకుంది. ఫరీదా అనే 65 సంవత్సరాల వృద్ధురాలు మాట్లాడుతూ... ‘ఈసారి మావాళ్లు చాలామంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో మావారు కూడా కీలక పాత్ర పోషిస్తారనేది నా అభిప్రాయం. మంచి ప్రభుత్వం రావాలి.. మా సమస్యలను తీర్చి, మమ్మల్నీ భారతీయ పౌరులుగా గుర్తించాలి. మిగతావారిలాగే మేం కూడా అన్ని హక్కులు అనుభవించేలా పరిస్థితులు కల్పించాలి. నేరాలను అరికట్టాలి. ఇవి మాత్రమే వచ్చే ప్రభుత్వం నుంచి మేం ఆశిస్తున్న అంశాల’న్నారు. భారతీయ పతితా ఉద్ధార్ సభా(బీపీయూఎస్) ప్రధాన కార్యదర్శి ఇక్బాల్ అహ్మద్ మాట్లాడుతూ... ‘బీబీరోడ్డులోని సెక్స్‌వర్కర్లలో 1,800 మంది ఓటు కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో దాదాపుగా అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిసింద’న్నారు. -
రెడ్‌లైట్ నుంచి న్యూయార్క్.. ఓ శ్వేత పయనం
కష్టాలు, కన్నీళ్లు ఆమెను నిరంతరం వెన్నంటి ఉండే నేస్తాలు. ఉండేది ప్రతినిత్యం రక్తమాంసాలతో వ్యాపారం సాగే నీచాతి నీచమైన ప్రాంతం. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలోని రెడ్‌లైట్ ప్రాంతంలో పెరిగి, పలుమార్లు లైంగిక అఘాయిత్యాలకు గురైన ఆ యువతి.. న్యూయార్క్ నగరంలో చదువుకోడానికి అమెరికా వెళ్లిపోయింది. పేదరికాన్ని, కష్టాలను అధిగమించి మరీ ఆమె ఈ విజయం సాధించింది. ఆమె పేరు శ్వేతా కత్తి (18). ముంబైలోని కామాటిపుర ప్రాంతంలో ఉండే అనేక మంది అభాగినులలో ఆమె పేరు ఉన్నా.. పెద్దగా ఎవరికీ తెలియదు. న్యూయార్క్ లోని బార్డ్ కాలేజిలో సైకాలజీ డిగ్రీ చదివేందుకు ఆమెకు స్కాలర్షిప్ లభించింది. ఆ చదువు పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగొచ్చి, తనలాంటి అభాగినులకు సాయం చేయాలని శ్వేత భావిస్తోంది. చిన్నప్పటి నుంచే తాను అలా కలలు కన్నానని, కానీ ఆ కల సాకారం అవుతుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. శ్వేత పట్టుదల కారణంగా ఆమె ప్రపంచ ప్రఖ్యాత పత్రిక న్యూస్ వీక్ 'యంగ్ వుమెన్ టు వాచ్' పేరిట ఎంపిక చేసిన 25 మంది బాలికల్లో ఒకరిగా నిలిచింది. తాలిబన్ల దాడిలో గాయపడి, కోలుకున్న పాకిస్థానీ బాలిక మలాలా పేరు కూడా ఈ జాబితాలోనే ఉంది. చిన్ననాటి నుంచి ఆమె అనేక కష్టనష్టాలకు గురైంది. ముంబైలోని కామాటిపుర ప్రాంతంలో ఆమె చూసిన నరకం అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ ఎవరో ఒకరు వచ్చి, ఎవరో ఒక మహిళను కొడుతుండేవాళ్లని, పోలీసులు ఎపు్పడు పడితే అప్పుడు వస్తుండేవారని, ఏమాత్రం ఇష్టం లేకపోయినా.. సంతోషంగా లేకపోయినా కూడా తప్పనిసరిగా అక్కడున్నవాళ్లంతా వ్యభిచారం చేయాల్సి వచ్చేదని శ్వేత వివరించింది. తమ పక్కన పడుకొమ్మని మగవాళ్లు వచ్చి అడిగినప్పుడు చాలా బాధగా అనిపించేదని, కానీ తప్పేది కాదని తెలిపింది. తండ్రితో పాటు చాలామంది తనను తిట్టి, కొట్టేవారు గానీ, తన తల్లి మాత్రం.. నువ్వు ఏమైనా చేయగలవంటూ ప్రోత్సహించేదని చెప్పింది. తాను చాలా మొండిదాన్నని, పాఠశాలలో తన పేదరికం, తక్కువ జాతి కారణంగా అన్నివైపుల నుంచి వివక్ష ఎదుర్కొన్నానని వివరించింది. ఫ్యాక్టరీ కార్మికురాలిగా పనిచేసే తన తల్లి తనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తినిచ్చినట్లు చెప్పింది. శ్వేత కన్న కలలు సాకారం కావడంలో 'క్రాంతి' అనే స్వచ్ఛంద సంస్థ తన వంతు పాత్ర పోషించింది. ముంబై రెడ్‌లైట్ ప్రాంతంలోని అమ్మాయిలు సామాజిక మార్పు తీసుకురావడానికి సాధకులుగా ముందుకు రావాలన్నదే ఈ సంస్థ ధ్యేయం. క్రాంతి సంస్థ రెండేళ్ల క్రితం శ్వేతను రెడ్‌లైట్ ప్రాంతం నుంచి తీసుకెళ్లి తమ సంరక్షణలో ఉంచుకుంది. అక్కడే ఆమె తన ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని విస్తరించుకుని, క్రమంగా సైకాలజీ అంశంలో కూడా ఆసక్తి పెంచుకుంది. చివరకు అమెరికాలో చదువుకునే అవకాశం లభించడంతో అమితానందానికి గురైంది. ఇతరుల జీవితాలను కూడా ఇది మారుస్తుందని, తన నేపథ్యాన్ని కూడా తాను గౌరవిస్తానని ఆమె తెలిపింది. ఇటీవలే ముంబైలో విమానం ఎక్కి.. అమెరికాకు వెళ్లిపోయింది.