సాక్షి,న్యూఢిల్లీ : బంగారం ధరలు భారం కానున్నాయి. పార్లమెంట్‌లో శుక్రవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మగువలకు ఇష్టమైన బంగారంపై పన్నుల భారం మోపారు. బంగారంపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను పెంచారు.
బంగారం సహా ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. బంగారంపై సుంకాల పెంపుతో స్వర్ణాభరాణాలు మరింత ప్రియం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడంతో పాటు డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటంతో ఇప్పటికే భారమైన బంగారం ధరలు తాజాగా సుంకాల పెంపుతో మరింత పెరగనున్నాయి.మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్‌లో పదిగ్రాముల బంగారం శుక్రవారం రూ 600 మేర పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment