న్యూఢిల్లీ: రాజ్యసభ తరహాలోనే శాసన మండలి ఎన్నికలూ ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్న కేంద్రం... దీనిపై రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. తద్వారా ధనబలానికి చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. ఎన్నికల కమిషన్ చేసిన ఈ ప్రతిపాదనపై అభిప్రాయం కోరుతూ జూన్‌లో నాటి న్యాయమంత్రి సదానందగౌడ.. రాష్ట్రాలకు లేఖలు రాశారు.
ద్విసభలున్న ఏడు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, బిహార్‌లు దీనికి మద్దతు తెలిపాయి. ఓపెన్ బ్యాలెట్ ప్రకారం ఎమ్మెల్యేలు ఓటు వేసిన తరువాత బ్యాలెట్ పేపర్‌ను తమ పార్టీ ప్రతినిధికి చూపించాలి. అలాకాక బ్యాలెట్ బాక్స్‌లో వేసినా, ప్రతినిధి అభ్యంతరం వ్యక్తం చేసినా చెల్లదు.
‘మండలి’కీ ఓపెన్ బ్యాలెట్!
Published Wed, Aug 10 2016 11:38 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
Advertisement