రేపు నింగిలోకి జీశాట్‌–17 | Gsat-17 into the sky tomorrow | Sakshi
Sakshi News home page

రేపు నింగిలోకి జీశాట్‌–17

Published Wed, Jun 28 2017 3:49 AM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

రేపు నింగిలోకి జీశాట్‌–17

రేపు నింగిలోకి జీశాట్‌–17

ప్రయోగానికి రంగం సిద్ధం
 
సూళ్లూరుపేట: జీశాట్‌–17 ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. గురువారం వేకువ జామున 2.29 గంటలకు ఫ్రాన్స్‌ అంతరిక్ష సంస్థ సహకారంతో ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని ప్రయోగిస్తారు. ఈ ఉపగ్రహం బరువు 3,425 కిలోలు. దీనిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు బుధవారం కౌంట్‌డౌన్‌ ప్రారంభించ నున్నట్టు సమాచారం. ఏరి యన్‌–5 ఈసీఏ, వీఏ238 అనే రాకెట్‌ ద్వారా దీనిని ప్రయోగించనున్నారు. ఫ్రాన్స్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం ఇస్రోకు చెందిన సమాచార ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి రోదసీలోకి పంపిస్తుంటారు.

అదేవిధంగా ప్రాన్స్‌కి చెందిన దూర పరిశీలనకు సంబంధించిన చిన్న తరహా ఉపగ్రహాలను ఇస్రో పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగిస్తోంది. భారత్‌కు ట్రాన్స్‌ఫాండర్ల కొరత ఉండటంతో వాటిని పెంచుకునే క్రమంలో సమాచార ఉపగ్రహాలను వరుసగా పంపుతున్నారు. ఈ నెల 5న మూడు టన్నుల జీశాట్‌–19 ఉపగ్రహాన్ని ప్రయోగించగా.. ఆ వెంటనే జీశాట్‌–17 ప్రయోగానికి సిద్ధం కావడం విశేషం. ఈ ఉపగ్రహంలో 24 సీ–బాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు, 2 లోయర్‌ సీ–బాండ్, 12 అప్పర్‌ సీ–బాండ్, 2 సీఎక్స్, 2 ఎస్‌ఎక్స్‌ ట్రాన్స్‌ఫాండర్లును అమర్చి పంపుతున్నారు. ఈ ఉపగ్రహం 15 సంవత్సరాలపాటు సేవలందిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement