‘అందుకే ఆమెను సస్పెండ్‌ చేశాం’ | Gujarat Women Police Suspended After Her Dancing Video in PS Goes Viral | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ వీడియో; మహిళా పోలీసు సస్పెండ్‌!

Jul 25 2019 2:47 PM | Updated on Jul 25 2019 4:52 PM

Gujarat Women Police Suspended After Her Dancing Video in PS Goes Viral - Sakshi

పోలీసుకు ఉండాల్సిన క్రమశిక్షణ ఆమెకు లేదు..

గాంధీనగర్‌ : ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా టిక్‌టాక్‌ యాప్‌లో మునిగితేలుతున్నారు. తమ టాలెంట్‌ను నిరూపించుకోవాలనే ఉత్సాహంతో కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొంత మంది నిబంధనలు అతిక్రమించి ఇబ్బందుల పాలవుతున్నారు. గుజరాత్‌కు చెందిన ఓ మహిళా పోలీసు అధికారి కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. అర్పితా చౌదరి అనే అధికారి పోలీసు స్టేషనులో లాకప్‌ ముందు డ్యాన్స్ చేస్తూ వీడియో రూపొందించారు. అనంతరం దానిని టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేసి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో బుధవారం ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఘటన గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ విషయం గురించి డీఎస్పీ మంజితా మాట్లాడుతూ..‘  అర్పితా నిబంధనలు అతిక్రమించారు. డ్యూటీలో ఉన్న సమయంలో యూనిఫాం వేసుకోలేదు. అంతేకాక లాకప్‌ ముందు డ్యాన్స్‌ చేస్తూ వీడియో తీశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒక పోలీసు అధికారికి ఉండాల్సిన క్రమశిక్షణ ఆమెకు లేదు. అందుకే సస్పెండ్‌ చేశాం’ అని వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement