తల నరికి పోలీస్‌స్టేషన్‌లోకి విసిరి.. | head cut in tamilnadu reddy palyam | Sakshi
Sakshi News home page

తల నరికి పోలీస్‌స్టేషన్‌లోకి విసిరి..

Published Thu, May 11 2017 1:36 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

head cut in tamilnadu  reddy palyam

సాక్షి, చెన్నై: యువకుడి తల నరికిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దానిని పోలీస్‌స్టేషన్‌లోకి విసిరి వెళ్లిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా రెడ్డిపాళ్యంలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి మోటార్‌ సైకిల్‌పై పోలీసుస్టేషన్‌ వద్దకు వచ్చిన ఇద్దరు యువకులు ఓ తలను కాంపౌండ్‌లోకి విసిరి ఉడాయించారు.

అదే సమయంలో పుదుచ్చేరి బాహూర్‌ వద్ద యువకుడి తలలేని దేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ తల ఆ యువకుడిదిగా భావించి విచారణ చేపట్టారు. విచారణలో బాహూర్‌కు చెందిన సువేదన్‌ (17)గా గుర్తించారు. చిన్న నేరాలకు పాల్పడుతూ, తమకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నారన్న ఆగ్రహంతో ఏదేని ముఠా ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement