head cut off
-
బిష్ణోయి స్త్రీలు..: చెట్ల కోసం తలలు ఇచ్చారు
‘పచ్చటి చెట్టు నరకకూడదు’ అని బిష్ణోయ్ తెగ మొదటి నియమం. మన దేశంలో పర్యావరణానికి మొదటి యోధులు బిష్ణోయ్ స్త్రీలే. కరువు నుంచి రక్షించే‘ఖేజ్రీ’ చెట్లను 1730లో రాజభటులు నరకడానికి వస్తే అమృతాదేవి అనే మహిళ తన తల అర్పించి కాపాడుకుంది. ఆమెతో పాటు 363 మంది బిష్ణోయిలు ఆరోజు బలిదానం ఇచ్చారు. బిష్ణోయిల పర్యావరణ స్పృహ గురించి బ్రిటిష్ రచయిత మార్టిన్ గుడ్మాన్ ‘మై హెడ్ ఫర్ ఏ ట్రీ’ పుస్తకం రాశాడు. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో దాని గురించి మాట్లాడాడు. వివరాలు...అందరూ ఎండు కట్టెలు వంట కోసం నేరుగా పొయ్యిలో పెడతారు. కాని బిష్ణోయి స్త్రీలు ఆ ఎండు కట్టెలను పరీక్షించి వాటి మీద క్రిమి కీటకాలు, బెరడును ఆశ్రయించి ఉండే పురుగులు... వీటన్నింటిని విదిలించి కొట్టి అప్పుడు పొయ్యిలో పెడతారు. ప్రాణం ఉన్న ఏ జీవజాలాన్నీ చంపే హక్కు మనిషికి లేదు’ అని బిష్ణోయిలు గట్టిగా విశ్వసించడమే దీనికి కారణం. బిస్ అంటే 20. నొయి అంటే 9. బిష్ణోయిల ఆది గురువు జంభోజి వారి కోసం 29 నియమాలను ఖరారు చేశారు. వాటిని పాటిస్తారు కాబట్టి వీరిని బిష్ణోయిలు అంటారు. మరో విధంగా వీరు వైష్ణవ పథానికి చెందిన వారు కాబట్టి కూడా విష్ణోయి లేదా బిష్ణోయి అని అంటారు.కరువు నుంచి బయటపడేందుకుపశ్చిమ రాజస్థాన్‌లో జోద్పూర్, బికనిర్లు బిష్ణోయిల ఆవాసం. 15వ శతాబ్దంలో ఇక్కడ తీవ్రమైన కరువు వచ్చింది. అందుకు కారణం చెట్లు, అడవులు నాశనం కావడమేనని ఆ సమయానికి జీవించి ఉన్న గురు జంభోజి గ్రహించారు. అందుకే చెట్టును కాపాడుకుంటే మనిషి తనను తాను కాపాడుకోవచ్చునని కచ్చితమైన నియమాలను విధించారు. వాటిని శిరోధార్యంగా చేసుకున్న బిష్ణోయిలు నాటి నుంచి నేటి వరకూ గొప్ప పర్యావరణ రక్షకులుగా ఉన్నారు. వీరి ప్రాంతంలో ఉన్న ఖేజ్రీ చెట్లను, కృష్ణ జింకలను వీరుప్రాణప్రదంగా చూసుకుంటారు. జింక పిల్లలను వీరు సాకుతారు. అవసరమైతే చనుబాలు ఇస్తారు.1730 స్త్రీల ఊచకోత1730లో జోద్పూర్ రాజు అభయ్ సింగ్ కొత్త ΄్యాలస్ నిర్మాణానికి కలప కోసం సైనికులను ఖేజర్లీ అనే పల్లెకు పంపాడు. అక్కడ ఖేజ్రీ చెట్లు విస్తారం. ఆ సమయానికి మగవారంతా పశువుల మందను మేపడానికి వెళ్లి ఉన్నారు. ఊళ్లో స్త్రీలు మాత్రమే ఉన్నారు. సైనికులు చెట్లు కొట్టబోతుంటే అమృతాదేవి అనే స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుపడింది. పచ్చని చెట్టును నరకకూడదు అంది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. వారంతా వచ్చి చెట్లను చుట్టుకుని నిలబడ్డారు. చాలామంది స్త్రీలు అలాగే చేశారు. సైనికులు వెర్రెత్తి పోయారు. గొడ్డలి ఎత్తారు. ‘చెట్టుకు బదులు నా తల ఇస్తాను తీసుకో’ అని గర్జించింది అమృతాదేవి. సైనికులు నిర్దాక్షిణ్యంగా ఆమెను, ఆమె కూతుళ్లను, ఆ తర్వాత మొత్తం స్త్రీ, పురుషులను కలిపి మొత్తం 363 మందిని నరికారు. ఇప్పటికీ ఆ ఊళ్లో ఆ జ్ఞాపకంగా స్మారక స్థూపం ఉంది.చలించిన రచయిత‘2020లో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌కు వచ్చినపుడు ఈ ఊచకోత గురించి తెలిసింది. పర్యావరణం కోసం ఇలాప్రాణత్యాగం చేసిన స్త్రీలు లేరు. నేను ఇది పుస్తకంగా రాయాలనుకున్నాను’ అన్నాడు బ్రిటిష్ రచయిత మార్టిన్ గుడ్మాన్. 2022లో అతను లండన్ నుంచి వచ్చి ఆరు నెలల పాటు బిష్ణోయి సమూహంతో ఉండి ‘మై హెడ్ ఫర్ ఏ ట్రీ’ పుస్తకం రాశాడు. ‘నేను బిష్ణోయి గురువు జంభోజి ఏ చెట్టు కిందైతే మరణించాడో ఆ చెట్టు కిందకు వెళ్లాను. ఆ రోజు రాజస్థాన్‌లో 36 డిగ్రీల ఎండ ఉంటే లండన్‌లో 40 డిగ్రీల ఎండ వుంది. బిష్ణోయిల నుంచి ఈ ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బిష్ణోయిలు చెట్లు పెంచుతూ, కుంటలు తవ్వుతూ తమ భూమిని సస్యశ్యామలం చేసుకుంటూనే ఉన్నారు. ఇందులో స్త్రీల కృషి అసామాన్యం. వీరి వల్లే చి΄్కో ఉద్యమ ఆలోచన వచ్చిందని కూడా మనం గ్రహించాలి’ అన్నాడు మార్టిన్ గుడ్మాన్.వేటాడితే జైల్లో వేస్తాంపుస్తకం ఆవిష్కరణ వేడుకలో బిష్ణోయి ఉద్యమకర్త నరేంద్ర బిష్ణోయి కూడా పాల్గొన్నాడు. ‘రాజస్థాన్‌లో 1972, 1980 చట్టాల ప్రకారం చెట్టు కొడితే 100 రూపాయల ఫైను. ఆ రోజుల్లో 100 పెద్దమొత్తం కావచ్చు. ఇవాళ్టికీ వంద కట్టి తప్పించుపోతున్నారు. ఈ చట్టంలో మార్పు కోసం పోరాడుతున్నాం. మేము పెద్దఎత్తున చెట్లు పెంచుతుంటే అభివృద్ధి పేరుతో సోలార్ ΄్లాంట్ల కోసం ప్రభుత్వం చెట్లు కొట్టేస్తోంది. ఇంతకు మించిన అన్యాయం లేదు. గత రెండు దశాబ్దాలుగా మాప్రాంతంలో కృష్ణ జింకలను చంపిన వారు కోర్టుల్లో ఏదో చేసి తప్పించుకున్నారు. అందుకే మా కుర్రాళ్లే లా చదివి అడ్వకేట్లు అవుతున్నారు. ఇక ఎవరు వేటాడినా వారిని జైళ్లల్లో మేమే వేయిస్తాం’ అన్నాడు నరేంద్ర బిష్ణోయి. ఈ గొప్ప పర్యావరణప్రేమికులు దేశం మొత్తానికి స్ఫూర్తినివ్వాలి. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
భార్య భోజనం వడ్డించలేదని.. తల నరికి, చర్మం ఒలిచి..!
తుంకూర్: భోజనం వడ్డించ లేదని భార్యతో తగవుపెట్టుకున్నాడు. పట్టరాని కోపంతో ఆమె తలను నరికేశాడు. అంతటితో ఆగక చర్మం ఒలి చేయడం మొదలుపెట్టాడు. తెల్లవారేదాకా ఒలుస్తూనే ఉన్నాడు. ఉదయం తాము ఉంటున్న ఇంటి యజమానికి ఈ ఘోరం వివరించాడు. దీంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లా కునిగల్ తాలుకాలోని హళియూరుదుర్గ పట్టణంలో సోమవారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. శివరామ, పుష్పలత(35)లకు పదేళ్ల క్రితం కులాంతర వివాహమైంది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడున్నాడు. శివరామ కోత మిల్లులో కార్మికుడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కోతమిల్లు నుంచి ఇంటికి వచ్చిన భర్తకు పుష్పలత భోజనం వడ్డించలేదు. ఇద్దరిమధ్య మొదలైన గొడవ తీవ్రమైంది. శివరామ ఆగ్రహంతో కొడవలితో భార్య తలనరికాడు. తర్వాత ఇతర అవయవాలను వేరు చేశాడు. చర్మం ఒలిచేయడం మొదలుపెట్టాడు. ఇల్లంతా రక్తపు మడుగులా మారింది. పేగులు చెల్లాచెదురుగా పడిపోయాయి. తెల్లవారేదాకా చర్మం ఒలుస్తూనే ఉన్నాడు. కుమారుడు అటు పక్కనే నిద్రిస్తుండగానే ఇదంతా జరిగిపోయింది. ఉదయం తాము ఉంటున్న యజమానికి శివరామ విషయం తెలిపాడు. అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులొచ్చి ఈ బీభత్సాన్ని స్వయంగా చూసిన తర్వాతే దారుణం బయటకు వచ్చింది. శివరామను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నేరం అంగీకరించాడని తుంకూర్ ఎస్పీ అశోక్ వెంకట్ గురువారం తెలిపారు. -
ఫ్రాన్స్ చర్చిలో కత్తితో దాడి
పారిస్: ఫ్రాన్స్‌లో మరో ఘోరం జరిగింది. చర్చిలో ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఓ మహిళ తల తెగిపడింది. మరో ఇద్దరు మరణించారు. నైస్ సిటీలోని నాట్రిడేమ్ చర్చిలో గురువారం ఈ దారుణం చోటుచేసుకుంది. అతడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. కిరాతకుడి వివరాలను అధికారులు ఇంకా బయటపెట్టలేదు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఉగ్రవాద చర్యేనని భావిస్తున్నారు. పోలీసులతో జరిగిన పెనుగులాటలో అతను గాయపడ్డాడని నైస్ నగర మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసీ చెప్పారు. చర్చిలో జరిగిన దాడిలో ముగ్గురు చనిపోవడం పట్ల ఫ్రాన్స్ ప్రధానమంత్రి జీన్ కాస్టెక్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తమ దేశానికి ముప్పు గరిష్ట స్థాయికి చేరినట్లు భావిస్తున్నామని అన్నారు.మరోవైపు, అవిగ్నొన్ నగరం సమీపంలోని మాంట్ఫెవిట్లో ఓ వ్యక్తి తుపాకీ చూపిస్తూ స్థానికులకు బెదిరింపులకు గురిచేశాడు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ ఖాతరు చేయలేదు. పోలీసులు అతడిని కాల్చివేసినట్లు స్థానిక రేడియో వెల్లడించింది. -
యువకుడి హత్య.. కనిపించని తల, కాళ్లు, చేతులు
చెన్నై,టీ.నగర్: తేని సమీపాన తల, చేతులు, కాళ్లు నరికిన స్థితిలో ఆదివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గోనె సంచిలో చుట్టి ముల్లైనదీ తీరంలో విసిరేసిన ఘటన సంచలనం కలిగించింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. తేని జిల్లా, కంభం సురుళిపట్టి రోడ్డు మీదుగా ముల్లైనది ప్రవహిస్తోంది. రాత్రి సమయంలో ఇక్కడ కొందరు చేపలు పడుతుంటారు. ఇలావుండగా ఆదివారం రాత్రి పది గంటల సమయంలో బండిపై వచ్చిన ఒక స్త్రీ, పురుషుడు గోనె సంచితో తొట్టమన్తురై ప్రాంతానికి వెళ్లారు. అనుమానించిన చేపలు పడుతున్నవారు కంభం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని గోనె సంచిని తెరిచిచూడగా 30 ఏళ్ల యువకుడి మృతదేహపు భాగాలు కనిపించాయి. తలలేని మొండాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల, కాళ్లు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తేని ఎస్పీ సాయిచరన్ తేజస్వి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తర్వాత ఆస్పత్రిలో మృతదేహాన్ని తిలకించారు. దీనిపై విచారణకు నాలుగు ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. మైలాడుదురై సమీపాన యువకుడి హత్య పంచాయతీలో జరిగిన ఘర్షణలో ఆదివారం ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి గ్రామపెద్ద సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నాగై జిల్లా, మైలాడుదురై సమీపంలోని పాలయూరు చిన్నకొక్కూరుకు చెందిన రైతు విజయకుమార్ ఆదివారం మృతిచెందాడు. మధ్యాహ్నం శవాన్ని గ్రామంలో ఊరేగించారు. విజయకుమార్ బంధువులు మాధవన్, రంజిత్ శవంపై పూవులు చల్లుతూ బయలుదేరారు. మార్గమధ్యంలోని ఆలయం వద్ద పూలు చల్లరాదని అదే ప్రాంతానికి చెందిన శేఖర్ కుమారుడు శరవణన్ (24) సూచించాడు. దీన్ని ఖాతరు చేయకుండా వారు అక్కడ పూలు చల్లారు. దీంతో వారి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహించిన శరవణన్ మాధవన్, రంజిత్‌పై దాడి చేశాడు. గ్రామస్తులు సర్దిచెప్పారు. తర్వాత మృతదేహానికి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇలావుండగా మాధవన్, రంజిత్ ఊరి పెద్ద రామచంద్రన్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామపెద్ద ఆదివారం రాత్రి సమావేశం జరిపి మాట్లాడారు. ఆ సమయంలోనూ శరవణన్, మాధవన్, రంజిత్ మధ్య ఘర్షణ ఏర్పడింది. మాధవన్‌కు మద్దతుగా గ్రామపెద్ద, సెంథిల్‌కుమార్ తోపాటు నలగురు శరవణన్‌పై దాడి చేశారు. ఇందులో శరవణన్‌కు కత్తిపోట్లు పడ్డాయి. రక్తపు మడుగులో పడిన శరవణన్‌ను ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. దీనిపై పాలయూరు పోలీసులు కేసు నమోదు చేసి రామచంద్రన్ సహా నలుగురిని అరెస్టు చేశారు. -
తల నరికి పోలీస్‌స్టేషన్‌లోకి విసిరి..
సాక్షి, చెన్నై: యువకుడి తల నరికిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దానిని పోలీస్‌స్టేషన్‌లోకి విసిరి వెళ్లిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా రెడ్డిపాళ్యంలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి మోటార్ సైకిల్‌పై పోలీసుస్టేషన్ వద్దకు వచ్చిన ఇద్దరు యువకులు ఓ తలను కాంపౌండ్‌లోకి విసిరి ఉడాయించారు. అదే సమయంలో పుదుచ్చేరి బాహూర్ వద్ద యువకుడి తలలేని దేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ తల ఆ యువకుడిదిగా భావించి విచారణ చేపట్టారు. విచారణలో బాహూర్కు చెందిన సువేదన్ (17)గా గుర్తించారు. చిన్న నేరాలకు పాల్పడుతూ, తమకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నారన్న ఆగ్రహంతో ఏదేని ముఠా ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.