పుణె/సిమ్లా: రాబోయే మూడ్రోజుల్లో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, జాలర్లు వేటకెళ్లొద్దని సూచించింది.
ఢిల్లీ, హరియాణా, అస్సాం, మేఘాలయల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నెల 27 నాటికి అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లో భారీ వర్షాలు కురవచ్చు. హిమాచల్‌లోని ధర్మశాలలో 60 ఏళ్ల తర్వాత తొలిసారి ఆగస్టులో రికార్డు స్థాయి వర్షం పడింది. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకూ(24 గంటల్లో) ధర్మశాలలో 292.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Comments
Please login to add a commentAdd a comment