ప్రస్తుతం వర్షం తగ్గినప్పటికీ చెన్నై మాత్రం జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. వరద నీరు ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ముంపు ప్రమాదంలోనే మహానగరం ఉండిపోయింది.
చెన్నై: ప్రస్తుతం వర్షం తగ్గినప్పటికీ చెన్నై మాత్రం జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. వరద నీరు ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ముంపు ప్రమాదంలోనే మహానగరం ఉండిపోయింది.
ఇప్పటి వరకు తమిళనాడులో వర్షాల కారణంగా 269మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ తాగునీరు, ఆహారం అందక బాధితులు అలమటిస్తున్నారు. మరోపక్క, మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ సంస్ద తెలిపింది.