
న్యూఢిల్లీ: వరదలో చిక్కుకున్న వారికి వీలైనంత సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం తమ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో చాలా చోట్ల అనేక మంది వరదల వల్ల నష్టపోయారని ఆమె తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను వారికి చేయగలిగినందత సాయం చేయాలని ఆదేశించారు. ‘అస్సాం, బిహార్, యూపీలోని అనేక ప్రాంతాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. వీటి వల్ల లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వరదల వల్ల నష్టపోయిన వారికి సాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వరదల్లో చిక్కుకున్న వారికి ఎంత వీలైతే అంత సాయం చేయాలని నేను పార్టీ నేతలను, కార్యకర్తలను కోరుతున్నాను’ అని ప్రియాంక సోమవారం ట్వీట్ చేశారు.
असम, बिहार और यूपी के कई क्षेत्रों में आई बाढ़ से जनजीवन अस्त व्यस्त है। लाखों लोगों पर संकट के बादल छाए हुए हैं।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 20, 2020
बाढ़ से प्रभावित लोगों की मदद के लिए हम तत्पर हैं। मैं कांग्रेस कार्यकर्ताओं व नेताओं से अपील करती हूं कि प्रभावित लोगों की मदद करने का हर संभव प्रयास करें। pic.twitter.com/RiOMe5R0D3
అసోంలో వరదల కారణంగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా సోమవారం నాటికి మొత్తం మరణాల సంఖ్య 85కు చేరింది. అస్సాంలో వరదల వల్ల 70 లక్షలకు పైగా ప్రభావితమయ్యారని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు.