కేంద్ర బడ్జెట్పై భారీ అంచనాలు
న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెడుతున్న సాధారణ బడ్జెట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. మధ్యతరగతి ప్రజల నుంచి బడా వ్యాపారవేత్తల దాకా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉద్యోగులకు ఆదాయపన్ను పరిమితిని పెంచడంతో పాటు పరిశ్రమలకు రాయితీలు ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. బంగారు దిగుమతులపైనా సుంకాన్ని తగ్గిస్తారని భావిస్తున్నారు. రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు.