దేశ రాజధానిలో బాలికపై అత్యాచారం..
దేశ రాజధానిలో మరో నిర్భయం ఘటన చోటు చేసుకుంది. ఓ కామంధుడు 8 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారాం చేశాడు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో నిర్భయం ఘటన చోటు చేసుకుంది. ఓ కామంధుడు 8 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారాం చేశాడు. వివరాలు.. ఇల్లు లేని బాలిక తల్లితండ్రులతో లుటియెన్స్ ఢిల్లీ లోని ఫుట్‌పాత్‌పై నిద్రించింది. ఈ ప్రాంతంలో స్వీపర్‌గా పనిచేసే నిందితుడు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.
బాలిక తల్లితండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తొలుత సంకోచించినా తర్వాత ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్య మొదలెట్టారు. అయితే నిందితుడు బాలిక కుటంబానికి పరిచయస్తుడని, ఈ ఘటన ఈ నెల 8 జరిగిందని పోలీసులు తెలిపారు.