స్కూల్‌ బాత్రూంలో ప్రసవం.. | 15-Year-Old, Raped Allegedly By Neighbour, Delivers Baby In School, Accused Arrested | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బాత్రూంలో ప్రసవం..

Published Sun, Jul 23 2017 9:39 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

స్కూల్‌ బాత్రూంలో ప్రసవం.. - Sakshi

స్కూల్‌ బాత్రూంలో ప్రసవం..

న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాల వాష్‌రూంలో విద్యార్థిని(15) ప్రసవించింది. పదో తరగతి చదువుతున్న ఆమెపై పొరుగింటి వ్యక్తి గత ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. శనివారం పరీక్ష రాయడానికి పాఠశాలకు వెళ్లిన ఆమెకు ఉన్నట్టుండి కడుపు నొప్పి వచ్చింది. వాష్‌రూంకు వెళ్లగా అక్కడే ప్రసవమైంది.

విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. బాలికను విచారించిన పోలీసులు పొరుగింటి వ్యక్తి(51) ఆమెపై గత ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు ఎవరికీ చెప్పొద్దని అతను డబ్బు ఇచ్చేవాడని బాలిక పోలీసులకు వెల్లడించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌కు చెందిన నిందితుడు.. ఢిల్లీలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. బాలిక తనకు కడుపులో నొప్పి కలుగుతోందని చెప్పడంతో.. నిందితుడు ఆమెకు పలుమార్లు అబార్షన్‌ పిల్స్‌ కూడా ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పిల్స్‌ కారణంగా 26వ వారంలోనే బాలికకు డెలివరీ అయినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement