'రాజకీయ రంగు పులమొద్దు' | I will meet home minister rajnath singh on eamcet issue, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

'రాజకీయ రంగు పులమొద్దు'

Published Wed, Jan 7 2015 11:11 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

'రాజకీయ రంగు పులమొద్దు' - Sakshi

'రాజకీయ రంగు పులమొద్దు'

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న ఎంసెట్ వివాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడతానని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు బుధవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.  ఈ అంశంపై అంతకు మించి తన జోక్యం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. దీనికి దయచేసి రాజకీయ రంగు పులమొద్దని విలేకర్లకు సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష నిర్వహణపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల్లో తీవ్ర సందిగ్థత నెలకొంది.

ఈ నేపథ్యంలో ఎంసెట్ పంచాయతీ గవర్నర్ వద్దకు చేరింది. దాంతో ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో గవర్నర్ సమక్షంలో చర్చలు జరిపారు. అయినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ అంశాన్ని మంగళవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వెంకయ్యనాయుడుపై విధంగా స్పందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement