కేన్సర్ వ్యాధికి నివారణ లేదన్నది అపోహ మాత్రమేనని, ఆత్మివిశ్వాసంతో ఎదుర్కొంటే పూర్తిగా నయమవుతుందని బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా, టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు.
కేన్సర్ వ్యాధికి నివారణ లేదన్నది అపోహ మాత్రమేనని, ఆత్మివిశ్వాసంతో ఎదుర్కొంటే పూర్తిగా నయమవుతుందని బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా, టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. కేన్సర్ గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడ్డ మనీషా, యువరాజ్ ఇద్దరూ పూర్తిగా కోలుకుని మళ్లీ కెరీర్ కొనసాగిస్తున్న విషయం విదితమే. యువీ జాతీయ జట్టులోకి రాగా, మనీషా సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది.
కేన్సర్ను ఏ దశలో గుర్తించామన్నది విషయం కాదని, ఆత్మవిశ్వాసంతో పోరాడితే ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చని యువరాజ్ అన్నాడు. 'మనం సాధించగలమనుకుంటే తప్పకుండా జయించవచ్చని' చెప్పాడు. కేన్సర్ అయినా మరే వ్యాధి అయినా కోలుకోవాలంటే మనోనిబ్బరంతో పోరాడాలని మనీషా పేర్కొంది. నయం కాదని కృంగిపోకుండా పోరాటపటిమతో ఎదుర్కోవాలని వారిద్దరూ పిలుపునిచ్చారు.