బాంబు పేలుడు ఘటనల్లో ఇండియానే ఫస్ట్
న్యూఢిల్లీ:
ప్రపంచవ్యాప్తంగా 2016లో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో మనదేశం మొదటి స్థానంలో నిలిచింది. అంతర్యుద్ధాలతో అట్టుడుగుతున్న ఇరాక్, అఫ్ఘానిస్తాన్, సిరియా దేశాలను సైతం ఈ విషయంలో పక్కకు నెట్టేసింది. ఆర్డీఎక్స్ పేలుళ్లు, ఐఈడీ పేలుడు ఘటనలు గత ఏడాది భారత్లో 406 నమోదవగా అందులో దాదాపు సగం అంటే 221 పేలుళ్లు ఇరాక్‌లో జరిగాయని నేషనల్ బాంబ్ డేటా సెంటర్(ఎన్‌బీడీసీ) పేర్కొంది.
అయితే, ఇందులో మృతుల సంఖ్యను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. దేశంలో జరిగిన ఈ పేలుళ్లు ఎక్కువ శాతం గురు, బుధవారాల్లోనే జరిగినట్లు తేలింది. దీంతోపాటు ఒక్క మార్చి నెలలోనే 42 పేలుడు ఘటనలు నమోదయ్యాయి. పొరుగునే ఉన్న పాకిస్తాన్‌లో 161, అఫ్ఘానిస్తాన్‌లో 132, బంగ్లాదేశ్‌లో 29 పేలుడు ఘటనలు జరిగాయి.