భర్త హత్య కేసులో నటి శ్రుతి అరెస్ట్
నీలిచిత్రంలో నటించాలని ఒత్తిడి చేసినందుకే చంపానని వెల్లడి
బెంగళూరు: భర్త హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న కన్నడ నటి శ్రుతి చంద్రలేఖ(22)ను పోలీసులు ఎట్టకేలకు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో శ్రుతి భర్త రోనాల్డ్ పీటర్ ప్రింజో(35) హత్యకు గురికాగా... ఆధారాలను సేకరించిన పోలీసులు గురువారం శ్రుతి సహా హత్యలో పాలుపంచుకున్న మరో ఏడుగురు నిందితుల్లో పలువురిని బెంగళూరులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
వీరిని తమిళనాడు పోలీసులు శుక్రవారం తీసుకుని వెళ్లినట్లు పోలీసు వర్గాల సమాచారం. శ్రుతి పలు కన్నడ, తమిళ సినిమాల్లో నటించింది. రోనాల్డ్ పీటర్ ఆమె రెండో భర్త. వ్యాపారంలో నష్టాలు రావడంతో నీలి చిత్రంలో నటించాలని పీటర్ తనపై ఒత్తిడి తెచ్చాడని, దాంతో పథకం ప్రకా రం అతడిని హత్య చేసినట్లు శ్రుతి విచారణలో పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే, ఈ హత్య కేసుకు సంబంధించి భిన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి.